ఐపీఎల్ వేలానికి మార్పులు చేసిన బీసీసీఐ.. పక్కా కమర్షియల్‌గా


న్యూఢిల్లీ: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం టైమ్‌ను బీసీసీఐ మార్చింది. వేలానికి కూడా మంచి వ్యూవర్‌షిప్, ఆదాయం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఐపీఎల్ సీజన్ 12 వేలం సమయాన్ని మార్చినట్లు బోర్డు వెల్లడించింది. మామూలుగా వేలం ఎప్పుడు జరిగినా ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యేది. అయితే ఈసారి మాత్రం అది మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలవుతుంది. దీనివల్ల ప్రైమ్‌టైమ్ వ్యూవర్‌షిప్‌ను బీసీసీఐ లక్ష్యంగా చేసుకుంది.

వేలం తేదీని కూడా బోర్డు వ్యూహాత్మకంగా
డిసెంబర్ 18న జరిగే ఈ వేలం మధ్యాహ్నం 3 గంటలకు మొదలై రాత్రి 9.30 గంటలకు ముగుస్తోంది. ఈసారి వేలం జైపూర్‌లో జరగనుంది. వేలం తేదీని కూడా బోర్డు వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. డిసెంబర్ 18 ఇండియా, ఆస్ట్రేలియా రెండో టెస్ట్ చివరి రోజు. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు ప్లేయర్స్ బదిలీల ప్రక్రియను పూర్తి చేశాయి. ప్రతి టీమ్ తమకు అందుబాటులో ఉన్న మొత్తంతో అవసరమైన ప్లేయర్స్‌ను వేలంలో కొనుగోలు చేయనున్నాయి.

ఆటగాళ్ల జాబితాను విడుదల చేసి..
ఐపీఎల్ వేలానికి వచ్చే సీజన్ కోసం ఫ్రాంఛైజీలు ఇప్పటి నుంచే తమ కసరత్తులను ముమ్మరం చేశాయి. నవంబర్ 15లోగా ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను అందించాలని ఐపీఎల్ నిర్వాహకులు సూచించడంతో ఫామ్‌లో లేని ఆటగాళ్లందరినీ ఫ్రాంచైజీలు ఇప్పటికే విడుదల చేశాయి.

సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలవడంలో
ప్రాంఛైజీలు విడుదల చేసిన ఆటగాళ్లలో పలువురు ఆటగాళ్లు వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది. ఉదహరణకు గతేడాది జరిగిన వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విడుదల చేయగా అతడిని వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది. గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలవడంలో షేన్ వాట్సన్ కీలకపాత్ర పోషించాడు.

2019 సీజన్‌కు దూరమయ్యే అవకాశం
వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులోని పలువురు ఆటగాళ్లు ఐపీఎల్ 2019 సీజన్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్, వరల్డ్ కప్‌ల మధ్య చాలా తక్కువ విరామం ఉండటంతో ఐపీఎల్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా క్రికెటర్ల విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications