ముంబై గెలుపు వెనుక: ఒకవైపు జ్యోతిష్కడు... మరొకవైపు సెంటిమెంట్

హైదరాబాద్: ఐపీఎల్ 12 సీజన్‌లో జోతిష్యుడి అంచనా నిజమైంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు కొద్ది గంటల ముందు ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా నిలుస్తుందంటూ ఓ జ్యోతిషుడు చెప్పిన సంగతి తెలిసందే. అంతర్జాతీయ స్థాయిలోనూ కెప్టెన్‌గా రోహిత్ శర్మ అద్భుతాలు సాధిస్తాడని, ధోనీకి అనుకూలంగా ఉన్న గ్రహాలు ఈసారి రోహిత్‌కు అనుకూలమయ్యాయని అతడు వివరించాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
అతడు చెప్పినట్టే ఆదివారం ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోగా... ఐపీఎల్‌లో నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గిన జట్టుగా ముంబై చరిత్ర సృష్టించింది.
కాగా, జోతిష్యుల అంచనా నిజమై ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడటంతో తమ జ్యోతిష్యమే గెలిచిందని పలువురు జ్యోతిష్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అసలు జ్యోతిష్యుడు ఏం చెప్పాడు?
భారత జట్టులోని ఆటగాళ్ల జాతకం ప్రకారం ధోనీ కంటే ఎక్కువ ట్రోఫీలు గెలిచే అదృష్టం ఒక్క రోహిత్‌శర్మకు మాత్రమే ఉందని చెప్పుకొచ్చాడు. రోహిత్‌శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ఉత్తమ కెప్టెన్ అవుతాడని కూడా ఈ సందర్భంగా తెలిపాడు. ఈసారి గ్రహాలన్నీ ముంబై ఇండియన్స్‌కే అనుకూలంగా ఉన్నాయని, జట్టులో ఆటగాళ్ల వయసు సగటు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పాడు.

2019లో యరేనస్ గ్రహం రోహిత్‌శర్మకు అనుకూలంగా
ఐపీఎల్ 2018 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పుడు సీఎస్‌కే విజయానికి సహకరించిన యరేనస్ గ్రహం 2019లో రోహిత్‌శర్మకు అనుకూలంగా ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో పాటు ముంబై ఇండియన్స్ జట్టుకు ఓ సెంటిమెంట్ కూడా కలిసిరానుంది. 2013, 2015, 2017... ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచిన సంవత్సరాలు.

ముంబైకి సెంటిమెంట్ కలిసొచ్చింది
దీనిని బట్టి చూస్తే రెండేళ్ల గ్యాప్‌తో ఈ జట్టు కప్ కొడుతూ వస్తోంది. ఇప్పుడు 2019 వచ్చింది. ఈ సెంటిమెంట్ ఫలిస్తే ఉప్పల్‌లో విజేతగా నిలిచేది ముంబై ఇండియన్సేనని అభిమానులు అంటున్నారు. దీంతో అటు అభిమానుల అంచనాలతో పాటు ఇటు జ్యోతిష్యుల అంచనా కూడా నిజమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications