జోస్ బట్లర్ రనౌట్ విషయంలో అశ్విన్ అనైతికంగా ప్రవర్తించాడా? (వీడియో)


హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ ఔట్ సరికొత్త వివాదాన్ని రేపింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ అనైతికంగా వ్యవహరించాడు. జైపూర్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్‌ని 'మన్కడింగ్ ' ఔట్ చేశాడు. దీంతో కాసేపు మైదానంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
బట్లర్ ఔట్ తర్వాత ఒత్తిడికి గురైన రాజస్థాన్ రాయల్స్ ఆఖర్లో కేవలం 16 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. మ్యాచ్‌లో అశ్విన్ తీరుపై నెటిజన్ల మండిపడుతున్నారు. 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా ఓ బ్యాట్స్‌మెన్‌ని ఔట్ చేయడం ఇదే తొలిసారి. రాజస్థాన్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ చివరి బంతికి ఈ ఘటన జరిగింది.
అసలు ఏం జరిగింది?
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం 185 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుని ఓపెనర్ జోస్ బట్లర్ (69: 43 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీతో మెరుగైన స్థితిలో నిలిపాడు. ఆ జట్టు విజయానికి 48 బంతుల్లో 80 పరుగులు అవసరమైన దశలో అశ్విన్ బౌలింగ్‌కి వచ్చాడు.

అశ్విన్ బంతి వేయబోయే సమయానికే
అశ్విన్ బంతి వేయబోయే సమయానికే బట్లర్ క్రీజ్ వదిలి కాస్త ముందుకు వచ్చాడు. ఇదే అదనుగా బౌలింగ్‌ని నిలిపివేసిన అశ్విన్ వెనక్కి వచ్చి బెయిల్స్ అప్పీల్ చేశాడు. ఆఖరి క్షణంలో బౌలింగ్‌ని నిలిపివేసి రనౌట్‌కి ప్రయత్నించడం నైతికత కాదని.. జోస్ బట్లర్‌తో సహా మ్యాచ్ కామెంటేటర్లు సైతం అభిప్రాయపడ్డారు.

థర్డ్ అంపైర్ కూడా దానిని ఔట్‌గానే
అయితే, థర్డ్ అంపైర్ కూడా దానిని ఔట్‌గానే ప్రకటించడంతో బట్లర్ వెనుదిరగాల్సి వచ్చింది. కానీ.. అశ్విన్ అనైతికతంగా వ్యవహరించాడని కాసేపు మైదానంలో గొడవచేసిన బట్లర్.. తిట్టుకుంటూనే పెవిలియన్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదం కూడా చోటు చేసుకుంది.

నిబంధనల (రూల్ 41.16) ప్రకారం
నిబంధనల (రూల్ 41.16) ప్రకారం థర్డ్ అంపైర్ తీసుకుంది సరైన నిర్ణయమే. కానీ, సుదీర్ఘ కెరీర్‌లో ‘జెంటిల్‌మన్'గా గుర్తింపు ఉన్న అశ్విన్... ఎలాగైనా వికెట్ తీయాలనే ప్రయత్నంలో ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యపరచింది. బంతిని వేసేందుకు ముందుకు వచ్చిన అశ్విన్ భుజాల వరకు చేతిని తెచ్చి అర క్షణం ఆగినట్లు రీప్లేలో కనిపించింది. బట్లర్ క్రీజ్ దాటేవరకు కావాలనే అతను వేచి చూసినట్లు అనిపించింది. ఇప్పుడు ఇది తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications