Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'పేరొద్దు.. ఆట చూపించు': సీఎస్‌కే ట్విట్టర్‌లో ఐపీఎల్ 2019 సాంగ్ విడుదల (వీడియో)

IPL 2019 Theme Song Released | Oneindia Telugu
IPL 2019 Anthem: MS Dhoni Outsmarts, Virat Kohli Dares Youngsters - Watch

హైదరాబాద్: మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం ప్రత్యేక సాంగ్‌ని విడుదల చేశారు. ప్రతి సీజన్‌కు కొత్త సాంగ్‌ని రూపొందిస్తున్న ఐపీఎల్ ప్రసారుదారు ఈ సారి మాత్రం యవ ఆటగాళ్లను ప్రోత్సహించేలా సాంగ్‌ని రూపొందించింది. ఈ సాంగ్‌ని చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. ఈ సాంగ్‌లో ఐపీఎల్‌ 2019 సీజన్‌లో ఆ స్టార్ ప్లేయర్లు అందరూ కనిపించారు.

ఓ గ్రూపు ప్లేయర్లంతా గల్లీ క్రికెట్

ఓ గ్రూపు ప్లేయర్లంతా గల్లీ క్రికెట్

రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్ ఐపీఎల్ జెర్సీలు వేసుకుని ప్రాక్టీస్ చేస్తుండగా ఈ సాంగ్ ప్రారంభమైంది. మరోవైపు ఓ గ్రూపు ప్లేయర్లంతా గల్లీ క్రికెట్ ఆడుతుంటారు. అనుకోకుండా వారంతా ఐపీఎల్‌ మ్యాచ్ జరిగే స్టేడియంలోకి వెళ్లాలని అనుకుంటారు. దీంతో గల్లీ క్రికెట్ ఫ్రేమ్ నుంచి ఐపీఎల్ మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తోన్న ప్రేమ్‌లోకి వెళ్లేందుకు ఒకరినొకరు తోసుకుంటూ ప్రయత్నిస్తుంటారు.

చివరకు ఈ తోపులాటలో

చివరకు ఈ తోపులాటలో

ఈ క్రమంలో వారంతా ఫెయిలైపోతారు. చివరకు ఈ తోపులాటలో ఓ గల్లీ క్రికెటర్ నిచ్చెన పైనుంచి అవతలివైపుకి వెళ్లాలని ప్రయత్నిస్తాడు. అదే సమయంలో ధోని పిచ్‌ను చదును చేసే రోలర్‌తో అరంగేట్రం చేస్తారు. దాని నుంచి కిందకు దిగగానే అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. ధోనీ వెనుక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వచ్చి యువ క్రికెటర్లు ఐపీఎల్ మ్యాచ్ జరిగే మైదానంలోకి ఆహ్వానిస్తాడు.

నా పేరు అంటూ ఉంటుంటే

వారిని చూసిన క్షణంలో అవాక్కైన ఓ గల్లీ ప్లేయర్ నా పేరు అంటూ ఉంటుంటే మాట్లడబోతుండగా 'పేరొద్దు.. ఆట చూపించు' అని ధోని, రోహిత్ శర్మ, కోహ్లీ అంటారు. ఆ తర్వాత వెనుక నుంచి 'గేమ్ బనాయేగా నామ్(ఆటే నీకు ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది)' అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో పాట వినిపిస్తుంది. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో అయింది. అంతేకాదు నెటిజన్లను ఈ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంది.

Story first published: Wednesday, March 6, 2019, 17:06 [IST]
Other articles published on Mar 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+