Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డుని ఆండ్రీ రస్సెల్ బద్దలు కొట్టేనా?

IPL 2019 : Will Andre Russell Break IPL All Time Record? || Oneindia Telugu
IPL 2019: Andre Russell on the verge of breaking all-time IPL record

హైదరాబాద్: గత సీజన్ల మాదిరే ఈ ఐపీఎల్ సీజన్‌ కూడా క్రికెట్ అభిమానులకు కనువిందు చేస్తోంది. ఆఖరి ఓవర్‌ ఫినిషింగ్‌లు, హ్యాట్రిక్స్, సూపర్ ఓవర్, స్పిన్ బౌలింగ్, యార్కర్లు, కళ్లు చెదిరే క్యాచ్‌లు, స్టేడియం బయటపడిన బౌండరీలు ఇలా... ఇక, మన్కడింగ్‌తో పాటు అంఫైర్‌ తప్పిదాలు లాంటి వివాదాలను కూడా మనం చూశాం.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అభిమానులకు టీ20 మజాను పంచిన రస్సెల్

అభిమానులకు టీ20 మజాను పంచిన రస్సెల్

ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, ధోని, క్రిస్ గేల్, జస్ప్రీత్ బుమ్రా, డ్వేన్ బ్రావో, కేఎల్ రాహుల్, ఏబీ డివిలియర్స్, శిఖర్ ధావన్ లాంటి ఆటగాళ్లు అద్భుతంగా ఆడటాన్ని అభిమానులు ఎంతగానో ఆస్వాదించారు. అయితే, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ మాత్రం వీరందరినీ మించి టీ20 మజాను అభిమానులకు అందించాడు.

12 మ్యాచ్‌ల్లో 486 పరుగులు

12 మ్యాచ్‌ల్లో 486 పరుగులు

ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆండ్రీ రస్సెల్ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 486 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 80 నాటౌట్. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు ఈ సీజన్‌లో 50 సిక్సులు కూడా బాదాడు. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

32 సిక్సులతో క్రిస్ గేల్ రెండో స్థానంలో

32 సిక్సులతో క్రిస్ గేల్ రెండో స్థానంలో

ఈ జాబితాలో మరో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్(32 సిక్సులు)తో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే, ఈ సీజన్‌లో ఆండ్రీ రస్సెల్ ముంగిట ఓ అరుదైన రికార్డు ఉంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడి రికార్డు. 2012 సీజన్‌లో క్రిస్ గేల్ 59 సిక్సులు బాదాడు.

అత్యధిక సిక్సులు రికార్డు

అత్యధిక సిక్సులు రికార్డు

ఇప్పటివరకు ఓ ఐపీఎల్ సీజన్‌లో ఓ ఆటగాడు బాదిన అత్యధిక సిక్సులు రికార్డు ఇది. ఇప్పుడు ఈ రికార్డుని ఆండ్రీ రస్సెల్ బద్దలు కొట్టే అవకాశం వచ్చింది. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఆండ్రీ రస్సెల్ మరో 10 సిక్సులు అలవోకగా బాదగలడని అభిమానులు ఆశిస్తున్నారు. అదే గనుక జరిగితే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా రస్సెల్ చరిత్ర సృష్టిస్తాడు.

Story first published: Thursday, May 2, 2019, 17:58 [IST]
Other articles published on May 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+