
హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 150 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా అమిత్ మిశ్రా చరిత్ర సృష్టించాడు. శ్రీలంక పేసర్ లసిత్ మలింగ తర్వాత ఐపీఎల్‌లో 150 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అరుదై ఘనత సాధించాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
అమిత్ మిశ్రా తీసిన 150వ వికెట్ మూడు సార్లు ముంబై ఇండియన్స్‌ను ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలబెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మది కావడం విశేషం. అమిత్ మిశ్రా వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో రోహిత్ శర్మ(30) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్లీన్ బౌల్డయ్యాడు. రోహిత్ శర్మ, అమిత్ మిశ్రా ఇద్దరూ ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహించారు.
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:
Lasith Malinga (SL) 161 wickets in 114 matches
Amit Mishra (IND) 150 wickets in 140 matches
Piyush Chawla (IND) 146 wickets in 152 matches
Dwayne Bravo (WI) 143 wickets in 126 matches
Harbhajan Singh (IND) 141 wickets in 153 matches
మరోవైపు ఇదే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ టీ20ల్లో 8వేల పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 30 పరుగులు నమోదు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌కు ముందు 8వేల మైలురాయిని చేరడానికి 12 పరుగుల దూరంలో ఉన్నాడు.
రోహిత్ కంటే ముందు సురేశ్ రైనా, విరాట్‌కోహ్లీలు ఈ ఘనత సాధించారు. రైనా 295 ఇన్నింగ్స్‌లో 8216 పరుగులు చేయగా.. కోహ్లీ 246 ఇన్నింగ్స్‌లో 8183 పరుగులు చేశాడు. మరోవైపు రోహిత్ శర్మ 294 ఇన్నింగ్స్‌లో 8వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.