Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మ్యాచ్ ఓటమితో పాటు రహానే మ్యాచ్‌ ఫీజులో కోత

IPL 2019: Ajinkya Rahane fined Rs 12 lakh for maintaining slow over-rate

హైదరాబాద్: ఆదివారం రాత్రి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 8 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగుల చేసి విజయాన్ని సాధించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు వరుసగా మూడో విజయం. మరోవైపు రాజస్థాన్‌ వరుసగా పంజాబ్, హైదరాబాద్, చెన్నై జట్లతో ఓడిపోయింది. ఇదిలా ఉంటే, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్ అజింక్య రహానేకు జరిమానా పడింది. స్లో ఓవర్‌రేట్‌ కారణంగా రూ.12 లక్షల మ్యాచ్‌ ఫీజును జరిమానాగా విధించారు.

ఆదివారం రాత్రి మ్యాచ్ జరుగుతున్న సమయంలో మంచు ఎక్కువగా కురిసింది. దీంతో రాజస్థాన్‌ బౌలర్లు బంతిపై పట్టు తెచ్చుకునేందుకు పదేపదే రుద్దడంతో.. రెండో ఇన్నింగ్స్‌ ఆలస్యమైంది. దీంతో ఐపీఎల్‌ యాజమాన్యం రహానే మ్యాచ్ ఫీజులో కోత విధించారు.

శనివారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా జరిమానా పడిన సంగతి తెలిసిందే. రోహిత్ మ్యాచ్ ఫీజులో కూడా 12 లక్షలను కోత విధించారు.

మంగళవారం రాత్రి రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్‌ జట్టు ఈ మ్యాచ్ లో అయినా విజయం సాధించి సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Story first published: Monday, April 1, 2019, 14:06 [IST]
Other articles published on Apr 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+