Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్.. మాల్దీవుల్లో 'రోహిత్‌ శర్మ' ఫ్యామిలీ టూర్

IPL 2019: After IPL historic triumph, Rohit Sharma chills out with family

టీమిండియా వైస్‌ కెప్టెన్‌, హిట్‌‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ గత కొంత కాలంగా వరుస సిరీస్‌లతో తీరికలేని క్రికెట్ ఆడుతున్నాడు. స్వదేశంలో ఆసీస్ సిరీస్ అనంతరం ఐపీఎల్-12 కారణంగా దాదాపు రెండు నెలల పాటు ఒక్క మ్యాచ్ కూడా మిస్ అవ్వకుండా ఆడాడు. ఇక మే 12న జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ జట్టును విజేతగా నిలిపి మరోసారి కప్ అందించాడు. దీంతో రోహిత్‌ శర్మ ఐపీఎల్‌ ట్రోఫీ విజయ సంబరాలలో మునిగితేలాడు.

మాల్దీవుల్లో ఫ్యామిలీ టూర్:

మే 30 నుండి వరల్డ్‌కప్‌ జరగనుంది. మెగా టోర్నీకి ఇంకా రెండు వారాల సమయమే ఉంది. ఎప్పటినుండో తీరికలేని క్రికెట్ ఆడుతున్న హిట్‌‌మ్యాన్‌ దొరికిన కొద్ది సమయాన్ని తన ఫ్యామిలీకి కేటాయించాడు. ప్రస్తుతం రోహిత్‌ మాల్దీవుల్లో కుటుంబ సభ్యులతో జాలిగా గడుపుతున్నాడు. రోహిత్ భార్య రితికా, కూతురు సమారియాలతో పాటూ కుటుంబ సభ్యులు ఈ టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

బీచ్‌ను చుట్టేస్తున్న రోహిత్, రితికా:

టూర్‌లో భాగంగా రోహిత్, రితికాలు బీచ్‌ను చుట్టేస్తున్నారు. మరోవైపు హోటల్‌లో తమకిష్టమైన ఫుడ్ లాగించేస్తున్నారు. ఈ ఫ్యామిలీ టూర్‌కు సంబంధించి ఫోటోలను రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అభిమానులు ఈ పోటోలను షేర్ చేసి.. తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు.

వైరల్‌ అవుతున్న #10YearChallenge:

వైరల్‌ అవుతున్న #10YearChallenge:

రోహిత్‌కు సంబంధించిన #10YearChallenge ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. 2009 ఐపీఎల్‌లో అప్పటి దక్కెన్ చార్జెస్ జట్టుకు ఆడిన రోహిత్.. 'ఎమెర్జింగ్‌ ప్లేయర్‌' అవార్డు అందుకున్నాడు. ఇక 2019 ఐపీఎల్‌లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా ఉండి ట్రోఫీ అందుకున్నాడు. 2009, 2019 ఫొటోలను జత చేసి షేర్‌ చేయడంతో.. ఆ ఫొటో ట్రెండింగ్‌లో ఉంది.

 విజయవంతమైన కెప్టెన్‌:

విజయవంతమైన కెప్టెన్‌:

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. నాలుగుసార్లు ముంబైకి టైటిల్ అందించి రికార్డులోకి ఎక్కాడు. మూడు ట్రోఫీలతో ఎంఎస్ ధోనీ రెండవ స్థానంలో ఉన్నాడు. అయితే 2009లో డెక్కన్ ఛార్జర్స్ కప్ గెలిచినప్పుడు కూడా రోహిత్ జట్టు సభ్యుడిగా ఉన్నాడు. 2013లో రోహిత్ ముంబై జట్టుకు తొలి ట్రోఫీని అందించాడు. తర్వాత 2015, 2017, 2019లలో ముంబైకి కప్ సాధించిపెట్టాడు.

Story first published: Friday, May 17, 2019, 11:16 [IST]
Other articles published on May 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+