Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విజయం అనంతరం సభ్యులమంతా మనసారా నవ్వుకున్నాం: డివిలియర్స్‌

IPL 2019: AB de Villiers believes in hard work, and not hard luck to make a difference

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు వరుస ఓటములతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. జట్టులో మేటి ఆటగాళ్లు ఉన్నా కూడా బెంగళూరు మాత్రం విజయాలు సాదించలేకపోతోంది. బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎదో ఒకదాంట్లో విఫలమయి చేజేతులారా మ్యాచ్‌లను ప్రత్యర్థులకు అప్పగిస్తోంది. వరుగా ఆరు మ్యాచులలో ఓడిన బెంగళూరు.. పంజాబ్‌పై గెలిచి తొలి విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బెంగళూరు జట్టుకు కొంత ఊరట లభించింది.

మనసారా నవ్వుకున్నాం:

మనసారా నవ్వుకున్నాం:

అయితే మ్యాచ్ అనంతరం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ మాట్లాడుతూ... 'మొహాలిలో బెంగళూరుకు విజయం దక్కింది. ఈ మైదానంలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ వరుసగా ఏడు మ్యాచ్‌లు గెలిచింది. చరిత్ర చూస్తే.. మేము ఏడో ఓటమిని చవిచూసేవాళ్లం. కానీ.. చివరి ఓవర్‌లో మ్యాచ్‌ గెలిచాం. పంజాబ్‌పై విజయం అనంతరం జట్టు సభ్యులమంతా మనసారా నవ్వుకున్నాం' అని డివిలియర్స్‌ తెలిపారు.

అదృష్టం విజయాల్ని తెచ్చిపెట్టదు:

అదృష్టం విజయాల్ని తెచ్చిపెట్టదు:

'ఐపీఎల్ టోర్నీలో చిన్న తప్పులకు కూడా అవకాశం ఇస్తే.. ప్రత్యర్థి జట్టు విజయం సాధించే అవకాశం ఉంటది. తనదైన రోజున టోర్నీలో ఓ జట్టు మరో జట్టుపై విజయం సాదిస్తది. అన్ని స్టేడియంలు అభిమానులతో నిండిపోతున్నాయి. మా ఓటములపై మీడియా, అభిమానులు స్పందిస్తారు. కానీ మరీ విపరీతంగా స్పందిస్తారని అనుకోలేదు. అదృష్టం విజయాల్ని తెచ్చిపెట్టదు.. కఠోర శ్రమే విజయం తీసుకొస్తుంది' అని డివిలియర్స్‌ చెప్పుకొచ్చారు.

ఏడో ఓటమి:

ఏడో ఓటమి:

సోమవారం రాత్రి వాంఖెడే మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో బెంగళూరు ఖాతాలో ఏడో పరాజయం చవిచూసింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19 ఓవర్లలో ఛేదించింది. డికాక్‌ (40), రోహిత్‌ (28), పాండ్యా (37 నాటౌట్‌; 16 బంతుల్లో 5పోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేశారు. అంతకుముందు టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. డివిలియర్స్‌, మొయిన్‌ అలీలు అర్థ సెంచరీలు చేశారు.

Story first published: Tuesday, April 16, 2019, 10:47 [IST]
Other articles published on Apr 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+