న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: వేలంలో అత్యధిక ధర పలికే ఆ నలుగురు వీరే

IPL 2019 : 4 Players Who Get More Demand Once They Get Released | Oneindia Telugu
 IPL 2019: 5 released players who could be expensive buys at the auction

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వచ్చే సీజన్ కోసం డిసెంబర్‌ నెలలో వేలం నిర్వహించనున్నారు. ఈ వేలాన్ని జైపూర్ వేదికగా డిసెంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించాలని బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకున్నట్లు ముంబై మిర్రర్‌లో ఇప్పటికే వార్త వచ్చింది.

ఐపీఎల్ వేలానికి వచ్చే సీజన్ కోసం ఫ్రాంఛైజీలు ఇప్పటి నుంచే తమ కసరత్తులను ముమ్మరం చేసాయి. నవంబర్ 15లోగా ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను అందించాలని ఐపీఎల్ నిర్వాహకులు సూచించడంతో ఫామ్‌లో లేని ఆటగాళ్లందరినీ ఫ్రాంచైజీలు ఇప్పటికే విడుదల చేశాయి.

ప్రాంఛైజీలు విడుదల చేసిన ఆటగాళ్లలో పలువురు ఆటగాళ్లు వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది. ఉదహరణకు గతేడాది జరిగిన వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విడుదల చేయగా అతడిని వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది. గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలవడంలో షేన్ వాట్సన్ కీలకపాత్ర పోషించాడు.

అయితే, వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులోని పలువురు ఆటగాళ్లు ఐపీఎల్ 2019 సీజన్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్, వరల్డ్ కప్‌ల మధ్య చాలా తక్కువ విరామం ఉండటంతో ఐపీఎల్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా క్రికెటర్ల విషయంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

వేలంలో అత్యధిక ధర పలికే నలుగురు ఆటగాళ్లు వీరే:

సీజన్లుగా కింగ్స్

సీజన్లుగా కింగ్స్

గత కొన్ని సీజన్లుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, గత సీజన్‌లో పేలవ ప్రదర్శన చేయడంతో పంజాబ్ యాజమాన్యం వచ్చే సీజన్ కోసం వేలానికి విడుదల చేసింది. టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున పలు మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్‌లో చక్కగా రాణించగలడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగలడు. దీంతో వచ్చే సీజన్‌లో ఎక్కువ ధర పలికే ఆటగాళ్లలో అక్షర పటేల్ ఒకడు.

మెక్‌కల్లమ్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్

మెక్‌కల్లమ్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్

టీ20 క్రికెట్‌లో బ్రెండన్ మెక్‌కల్లమ్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి సందేహాం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ తన ఎటాకింగ్ స్టైల్‌తో టీ20ల్లో సత్తా చాటుతున్నాడు. ఐపీఎల్ 2008లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరుపున 158 నాటౌట్‌తో సెంచరీతో చెలరేగాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో అత్యుత్తమ ఆటతీరుని కనబరుస్తోన్న విదేశీ ఆటగాళ్లలో మెక్‌కల్లమ్ ఒకడు. అయితే, గత సీజన్‌లో బెంగళూరు తరుపున పేలవ ప్రదర్శన చేశాడు. తాను ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో 127 పరుగులు మాత్రమే చేశాడు.

అత్యధిక ధర పలికిన క్రికెటర్

అత్యధిక ధర పలికిన క్రికెటర్

గత సీజన్‌లో అత్యధిక ధర పలికిన క్రికెటర్. అందుకు కారణం ఐపీఎల్ 2017 సీజన్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ తరుపున అద్భుతంగా రాణించడమే. ఐపీఎల్ 10వ సీజన్‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ జట్టు ఫైనల్ వరకు వెళ్లింది అంటే అందుకు కారణం ఉనద్కత్. 2018 సీజన్ ఆటగాళ్ల వేలంలో.. జయదేవ్ ఉనద్కత్‌ కోసం ఫ్రాంఛైజీలతో ఆఖరి వరకూ పోటీపడిన రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రూ. 11.5కోట్లు కుమ్మరించి మరీ జట్టులో తీసుకుంది. కానీ.. 2018 సీజన్‌లో 15 మ్యాచ్‌లాడిన జయదేవ్ తీసిన వికెట్లు 11 మాత్రమే. దీంతో ఫ్రాంఛైజీ అతడిని విడిచిపెట్టింది.

 క్రికెటర్లకు భళే డిమాండ్

క్రికెటర్లకు భళే డిమాండ్

ఐపీఎల్‌లో విదేశీ క్రికెటర్లకు భళే డిమాండ్ ఉంది. అలాంటి ఆటగాళ్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒకడు. టీ20 ఫార్మాట్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు విధ్వంసకర బ్యాట్స్‌మన్ అని పేరుంది. అలా భావించే గత సీజన్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ పెద్దమొత్తం చెల్లించి వేలంలో కొనుగోలు చేసింది. అయితే, గత సీజన్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ ప్రదర్శన ఆశించిన మేరకు లేకపోవడంతో విడుదల చేసింది.

Story first published: Monday, November 19, 2018, 16:39 [IST]
Other articles published on Nov 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X