
5. హర్భజన్ సింగ్:
చెన్నై సూపర్ కింగ్స్ అంటిపెట్టుకున్న ఆటగాళ్లలో హర్భజన్ సింగ్ పేరుండటం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. గత సీజన్‌లో చెన్నైకి ప్రాతినిధ్యం వహించిన భజ్జీ పెద్దగా స్పిన్ చేయలేకపోయాడు. బహుశా తన దూకుడుని కోల్పోయినట్లుగా కనిపిస్తుండటంతో తప్పుకోవడం తప్పదేమోననే పరిస్థితి కనపడుతుంది. ముంబై ఇండియన్స్‌కు పదేళ్ల పాటు బాధ్యతలు వహించిన భజ్జీ.. 2016వరకూ 38 మ్యాచ్‌లలో 24వికెట్లు తీసుకున్నాడు. అతని ప్రదర్శనను బట్టే 2018సీజన్‌లో అతణ్ని ధోనీ కేవలం 10 మ్యాచ్‌లే ఆడనిచ్చాడు. ఈ సీజన్‌లో రాణించి మరో సీజన్‌కు కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటాడా.. దీంతోనే సరిపెట్టుకుంటాడా అనేది హర్భజన్‌పైనే ఆధారపడి ఉంది.

4. కీరన్ పొలార్డ్:
ఇదే వరుసలో మరో అంతర్జాతీయ క్రికెటర్ అయిన కీరన్ పొలార్డ్ ముంబై ఇండియన్స్ నుంచి వీడిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. గడిచిన రెండు సీజన్లుగా పొలార్డ్ పెద్దగా రాణించలేకపోతున్నాడు. బ్యాటింగ్.. బౌలింగ్ లోనూ ఎందులోనూ సత్తా చాటలేక సతమతమవుతున్నాడు. దీంతో ముంబై జట్టుకు పొలార్డ్ భారంగా తయారైనట్లు కనిపిస్తోంది. ఐపీఎల్ కెరీర్‌లోనే తొలిసారి ఈ సీజన్‌లో అత్యంత తక్కువ మ్యాచ్‌లలో కనిపించాడు పొలార్డ్. 9 మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్ 133పరుగులను చేసి టాప్ ఆర్డర్ బ్యాటింగ్ అవకాశాలను పొగొట్టుకున్నాడు. గత ఐదు సీజన్లుగా కేవలం 5వికెట్లు మాత్రమే తీయగలిగాడు.

3. గౌతం గంభీర్:
టీమిండియా వెటరన్ ప్లేయర్ గౌతం గంభీర్ ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యంత దారుణమైన 2018 సీజన్ కంటే మరొకటి లేదు. 2018 సీజన్ ఆరంభంలో అత్యంత చౌకబారు ప్రదర్శన చేసిన గంభీర్ 6 మ్యాచ్‌లలో 85పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంతేగాక, కెప్టెన్‌గా ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను చక్కగా నడిపించడంలో విఫలమైయ్యాడు. దానికి నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ జట్టు అతణ్ని అంటి పెట్టుకోకుండా విడుదల చేసేయడంతో అతణ్ని ఏదైనా జట్టు తీసుకుంటే మాత్రం ఇదే సీజన్ అతని ఐపీఎల్ కెరీర్‌కు ఆఖరిది కావొచ్చు.

2. యువరాజ్ సింగ్:
ఆఖరి సీజన్‌గా చెప్పుకోవడానికి టీమిండియా మరో వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సిద్ధంగా ఉన్నాడు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించి చక్కగా జట్టును నడిపించిన ఆల్‌రౌండర్లలో యువరాజ్ సింగ్ ఒకరు. ఇప్పటికే పంజాబ్ జట్టు వదిలేయడంతో ఐపీఎల్ 2019కి పాల్గొనడమనేదే ప్రశ్నార్థకంగా మారింది. 2020 వరల్డ్ కప్‌లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని రిటైర్మెంట్ ప్రకటించకుండా ఎదురుచూస్తున్న యువరాజ్.. తన ప్రతిభను చాటుకునేందుకు దేశీవాళీ లీగ్ అయిన రంజీ ట్రోఫీల్లో ఆడేందుకు సిద్ధమైయ్యాడు. బహుశా వేలంలో అతణ్ని ఏదైనా జట్టు తీసుకుంటే ఇది మాత్రం ఆఖరి సీజన్ కావొచ్చు.

1. షేన్ వాట్సన్:
వయస్సు మీద పడుతున్నా.. బ్యాటింగ్‌తో అదరగొడుతున్న వారిలో షేన్ వాట్సన్ ఒకరు. 2018 సీజన్‌లో చెన్నైకి ప్రాతినిధ్యం వహించి ఐపీఎల్ 2018ఫైనల్ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోన్న టీ20 లీగ్‌లలో బంతిని బలంగా బాది సత్తా చాటుతున్న వారిలో వాట్సన్ టాప్ జాబితాలో నిలిచాడు. గడిచిన సీజన్‌లో 15మ్యాచ్‌లు ఆడి 555పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే ధోనీ కెప్టెన్సీలో ఆడుతున్న వాట్సన్ కూడా చక్కటి ఫిట్‌నెస్‌తో ఉండటం ప్రత్యేకం.


Click it and Unblock the Notifications













