న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2019: సీఎస్‌కే కెప్టెన్‌గా ధోని ఆ మూడు రికార్డులను అందుకుంటాడా?

IPL 2019: MS Dhoni Will Reach These 3 Records In This IPL Season?? | Oneindia telugu
IPL 2019: 3 records which Chennai Super Kings (CSK) captain MS Dhoni could create this season

హైదరాబాద్: మార్చిలో ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కోసం కొన్ని మైలురాళ్లు ఎదురు చూస్తున్నాయి. గతేడాది ఐపీఎల్ టైటిల్‌ను ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. గతేడాది మొత్తం పేలవ ప్రదర్శన చేసిన ధోని ఈ ఏడాది ఫామ్‌లోకి వచ్చాడు. ఇటు వికెట్‌ కీపర్‌గా, అటు బ్యాట్స్‌మెన్‌గా చెలరేగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా చెన్నై సూపర్‌ కింగ్స్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ క్రమంలో ధోని ఖాతాలో పలు రికార్డులు చేరనున్నాయి.

పాత యువీని గుర్తుకు తెచ్చాడు: రివర్స్ స్వీప్ సిక్స్ చూశారా? (వీడియో) పాత యువీని గుర్తుకు తెచ్చాడు: రివర్స్ స్వీప్ సిక్స్ చూశారా? (వీడియో)

ఐపీఎల్‌లో 200 సిక్స్‌లు

ఐపీఎల్‌లో 200 సిక్స్‌లు

ఐపీఎల్‌లో ఇప్పటివరకు ధోని మొత్తం 186 సిక్స్‌లు బాదాడు. ఈ సీజన్‌లో మరో 14 సిక్స్‌లు కొట్టినట్లియితే ఐపీఎల్‌లో 200 సిక్స్‌లు పూర్తి చేసుకున్న తొలి భారతీయ క్రికెటర్‌గా ధోని రికార్డు నెలకొల్పుతాడు. ఈ జాబితాలో 292 సిక్స్‌లతో క్రిస్‌గేల్‌ ముందు స్థానంలో ఉండగా, 186 సిక్స్‌లతో ధోనీ, 185 సిక్స్‌లతో సురేశ్‌ రైనా, 184తో రోహిత్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

తొలి వికెట్‌కీపర్‌గా?

తొలి వికెట్‌కీపర్‌గా?

ఐపీఎల్‌ చరిత్రలో 116 క్యాచ్‌లు పట్టిన వికెట్‌కీపర్‌గా ధోనీకి పేరుంది. దినేశ్‌కార్తిక్‌ 124 క్యాచ్‌లతో ధోనీ కంటే ముందున్నాడు. గత కొన్ని సీజన్లుగాఈ రికార్డు ధోనీని ఊరిస్తోంది. కీపర్‌గా ప్రస్తుతం ధోనీ ఉన్న దూకుడులో ఈ ఐపీఎల్‌లో దినేశ్‌కార్తిక్‌ను దాటేయడం పెద్ద కష్టం కాదు.

అత్యధిక విజయాలను అందుకున్న కెప్టెన్‌గా

అత్యధిక విజయాలను అందుకున్న కెప్టెన్‌గా

చెన్నై సూపర్‌ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ 159 మ్యాచుల్లో 94 మ్యాచ్ విజయాలను అందుకున్నాడు. ఐపీఎల్‌లో చరిత్రలో ఎక్కువ మ్యాచ్‌ల్లో విజయాలందుకొన్న కెప్టెన్‌గా ధోని కొనసాగుతున్నాడు. అయితే మరో 6 మ్యాచులు విజయం సాధిస్తే ధోని 100 మ్యాచ్‌ విజయాలను అందుకున్న ఆటగాడిగా నిలుస్తాడు. ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా ధోని అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంటాడు.

Story first published: Monday, February 18, 2019, 19:12 [IST]
Other articles published on Feb 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X