For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టేడియంలో చిన్నారిని పట్టుకుని ఆవేదన వ్యక్తం చేసిన యువీ

IPL 2018: Yuvraj Singhs gesture for young fan suffering from cancer is touching hearts

హైదరాబాద్: సిక్సుల వీరుడు యువరాజ్ సింగ్ ఓ యువ అభిమానిని కలుసుకున్నాడు. మామూలు వ్యక్తిని కలిస్తే అందులో విశేషమేముండదు. కానీ, అతను కలుసుకుంది క్యాన్సర్‌తో పోరాడుతోన్న చిన్నారిని.
రాకీ అనే ఆ చిన్నారిని కాపాడుకునేందుకు అతని తండ్రి తన బోన్ మారోను సైతం దానం చేశాడు. అటువంటి పరిస్థితుల్లోనూ రాకీ యువరాజ్ సింగ్‌ను కలుస్తానని అడగడంతో యువరాజ్ సింగ్ ను కలిసే ఏర్పాటుచేశారు.

మహమ్మారిని జయించి తిరిగి క్రికెట్‌లోకి:

మహమ్మారిని జయించి తిరిగి క్రికెట్‌లోకి:

క్యాన్సర్ బారిన పడి మృత్యువు అంచుల దాకా వెళ్లిన యువీ(యువరాజ్‌ సింగ్‌), ఆ మహమ్మారిని జయించి తిరిగి క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు. ఈ విషయంలో యువీ తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. యువరాజ్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ 2018 సిరీస్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున ఆడుతున్నారు. మ్యాచ్‌ ప్రారంభం కావడానికి ముందు యువీ, క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడిని కలుసుకున్నారు.

11 ఏళ్ల రాకీ ఆదర్శంగా యువరాజ్ సింగ్‌ను:

11 ఏళ్ల రాకీ ఆదర్శంగా యువరాజ్ సింగ్‌ను:

దానికి సంబంధించిన ఫోటోలను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తన అధికారిక ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న 11 ఏళ్ల రాకీ, తన ఆదర్శంగా తీసుకునే వ్యక్తి యువరాజ్ సింగ్‌ను కలుకున్నాడు. యువ్‌తో రాకీ కొంత సమయం పాటు గడిపాడు. పిల్లాడి చేతులు పట్టుకుని కాసేపటి వరకూ ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత ఆ చిన్నారితో సరదాగా మాట్లాడుతూ పిల్లాడిని ఉత్సాహపరిచాడు.

రాకీ కచ్చితంగా ఈ మహమ్మారిని నుంచి:

రాకీ కచ్చితంగా ఈ మహమ్మారిని నుంచి:

స్కూల్‌ బ్యాగ్‌, క్యాప్‌, టీ-షర్ట్‌ను రాకీకి గిఫ్ట్‌గా ఇచ్చారు. రాకీ కచ్చితంగా ఈ మహమ్మారిని నుంచి జయిస్తాడని యువీ అన్నారు. రాకీ తండ్రికి కూడా యువీ ధైర్యమిచ్చారు. గుండె నిబ్బరం చేసుకుని ఉండాలని రాకీ తండ్రికి సూచించారు. యువరాజ్‌ సైతం 2011 తర్వాత క్యాన్సర్‌ మహమ్మారి బారిన పడ్డారు. ‘రాకీ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం' అనే క్యాప్షన్‌తో ఆ ఫోటోను షేర్‌ చేసింది. రాకీ అసలు పేరు దైనిక్‌ భాస్కర్‌. గత 10 ఏళ్లుగా బ్లడ్‌ క్యాన్సర్‌తో రాకీ బాధపడుతున్నాడు. తనకు క్యాన్సర్‌ చికిత్స ప్రారంభం కావడానికి కాస్త ముందు యువీని కలుసుకోవాలని ఆ పిల్లాడు భావించాడు. ఇలా యువరాజ్‌, రాకీని కలుసుకున్నారు.

త్వరగా కోలుకోవాలంటూ యువీ అభిమానులు:

త్వరగా కోలుకోవాలంటూ యువీ అభిమానులు:

క్యాన్సర్‌ జయించుకుని వచ్చిన యువీ, క్రికెట్‌లోకి మళ్లీ పునరాగమనం చేశారు. ఆ బాలుడితో కలిసి యువీ దిగిన ఫోటోలు, నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నాయి. రాకీ త్వరగా కోలుకోవాలంటూ యువీ అభిమానులు సైతం ప్రార్థిస్తున్నారు. చికిత్స కోసం రాకీ ఆరు నెలల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుంది. కొడుకును బతికించుకోవడం కోసం రాకీ తండ్రి తన బోన్‌ మారోను దానం చేశాడు.

Story first published: Friday, May 11, 2018, 14:59 [IST]
Other articles published on May 11, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+