రక్తంతో అభిమాని లేఖ: చివుక్కుమన్న విరాట్ కోహ్లీ మనసు

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో అత్యధిక మంది అభిమానులు కలిగి ఉన్న క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. మైదానంలో దిగితే చాలు రికార్డుల మోత మోగించాల్సిందే. క్రికెట్‌లో కోహ్లీని ఓ ఆటగాడిగానే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ సెలబ్రిటీగా కోహ్లీని ఎంతోమంది ఆరాధిస్తారు.
ఓ మితిమీరిన అభిమానం తనను భయానికి గురి చేసిందని, అందుకు సంబంధించిన సంఘటన గురించి తాజాగా కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 'రక్తంతో రాసిన లేఖను నాకు ఒకరు ఇచ్చారు. మనస్సు చివుక్కుమంది. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. నేను కారులో వెళుతుండగా.. కారు అద్దాలను దింపాను. అంతలోనే ఒక కాగితం వచ్చి పడింది' అని కోహ్లీ అన్నాడు.

రక్తంతో రాసి ఉన్న లేఖ
'ఎవరో దానిని కారులోకి విసిరేశారు. ఎవరు ఇచ్చింది కూడా నేను చూడలేదు. అది రక్తంతో రాసి ఉన్న లేఖ. దానిని పూర్తిగా కూడా చూడలేదు. దానిపై రాసిన వ్యక్తి పేరు ఉంది. వెంటనే దానిని సెక్యూరిటీకి ఇచ్చేశాను. దానిని స్వీకరించలేకపోయాను. ఎంతో భయం వేసింది' అని కోహ్లీ తెలిపాడు.

ఐపీఎల్ వల్ల క్రికెటర్లకు, ఫ్యాన్స్‌కు మధ్య గ్యాప్ తగ్గింది
ఇక, ఐపీఎల్ రావడంతో క్రికెటర్లకు, అభిమానులకు మధ్య గ్యాప్ తగ్గిపోయిందని, తరచూ ప్రయాణాలు చేయాల్సి రావడంతో క్రికెటర్లు ప్రయాణికులకు ఎదురుపడే సందర్భాలు పెరిగాయని కోహ్లీ ఈ సందర్భంగా వెల్లడించాడు. దీంతో ఎక్కడ కనపడినా, సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడటం సాధారణమైంది.

లేచి చూసేసరికి నా ఓడిలో ఓ బేబీ ఉంది
ఓసారి విమానంలో ప్రయాణిస్తుండగా తాను నిద్రలో మునిగిపోయానని, ఓ వ్యక్తి వచ్చి తనతో సెల్ఫీ దిగాడని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. ‘ఓసారి నేను ఫ్లయిట్‌లో ఉన్నాను. ఐపీఎల్ గేమ్స్ సమయంలో అనుకుంటా. చెవులకు హెడ్‌ఫోన్స్ పెట్టుకొని నేను పడుకొని ఉన్నాను. లేచి చూసేసరికి నా ఓడిలో ఓ బేబీ ఉంది' అని కోహ్లీ చెప్పాడు.

ఒక వ్యక్తి నాతో సెల్ఫీ దిగుతున్నాడు
'ఎవరో నన్ను భుజం తట్టి నిద్రలేపారు. ఒక వ్యక్తి నాతో సెల్ఫీ దిగుతున్నాడు. నేను గ్లాసెస్ పెట్టుకోవడంతో మేలుకువతో ఉండి అతన్ని చూస్తున్నాడని అనుకున్నట్టున్నాడు. కానీ నేను అప్పుడు నిద్ర పోతున్నాను' అని విరాట్ కోహ్లీ వివరించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో కోహ్లీ ఆర్‌బీసీకి కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు.

అత్యధిక సింగిల్స్ తీసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ
ఈ ఏడాది ఐపీఎల్‌లో అత్యధిక సింగిల్స్ తీసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఏప్రిల్ 7 నుంచి మే 1వ తేదీ వరకు జరిగిన మ్యాచ్‌లను పరిగణనలోనికి తీసుకుంటే అత్యధిక సింగిల్స్ తీసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడిన కోహ్లీ 349 పరుగులు సాధించాడు. ఇందులో 113 పరుగులు వికెట్ల మధ్య సింగిల్స్ ద్వారా వచ్చినవే కావడం విశేషం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications