
హైదరాబాద్: సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఐపీఎల్-2018 పై ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో జట్టు అట్టి పెట్టుకుంటున్న వాళ్ల జాబితాను ఇప్పటికే విడుదల చేసింది. ఇంకా మిగిలిన వాళ్లని సొంతం చేసుకోవాలనుకున్న క్రమంలో అన్ని జట్లు వారి ఖాతాలో పెంచుకోవటానికై ఆరాటపడుతున్నాయి.
ఈ నెల 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి తమ కనీస ధరను తెలియజేయాల్సిందిగా భారత జట్టుకు ఆడిన ఆటగాళ్లతో పాటు ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లను కోరింది. దీంతో యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, పొలార్డ్, మెకల్లమ్ తదితరులు తమ కనీస ధరను ప్రకటించారు.
దేశం తరఫున ప్రాతినిథ్యం వహించిన(అన్‌క్యాప్‌డ్) ఆటగాళ్లకు కనీస ధరను రూ.50లక్షలుగా ఇప్పటికే ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించారు. జాతీయ మీడియా వెల్లడించిన దాన్ని బట్టి యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, బ్రెండన్ మెకల్లమ్, చాహల్‌లు తమ కనీస ధరను రూ.2కోట్లగా ప్రకటించారని సమాచారం. అలాగే యూసుఫ్ పఠాన్ రూ.75లక్షలు, ఇర్ఫాన్ పఠాన్ రూ.50 లక్షలుగా తెలిపినట్లు సమాచారం.
నిషేధిత ఉత్ప్రేరకం వాడినందుకు ఐదు నెలల నిషేధం ఈ నెల 14తో ముగియడంతో యూసుఫ్ ఐపీఎల్ 11వ సీజన్ వేలంలో పాల్గొనబోతున్నాడు. ఇంకో ప్రధాన ఆటగాడైన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తనను అట్టి పెట్టుకోకపోవడంపై గంభీర్ అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ, మళ్లీ ఆర్‌టీఎమ్ ద్వారా గంభీర్‌ను తమ వద్దే ఉంచుకోవాలని నైట్‌రైడర్స్ భావిస్తోన్నట్లు సమాచారం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.