Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రషీద్ ఖాన్ అరుదైన సంపద.. ఎవరికీ ఇవ్వలేం మోడీ గారు: ట్విట్టర్‌లో ఆప్ఘన్ అధ్యక్షుడు

 IPL 2018: We wont give Rashid Khan away says Afghan President Ghani as Sushma Swaraj tweets about Indian citizenship

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రషీద్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్‌‌రైడర్స్‌తో జరిగిన రెండో ‍క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు విజయంలో రషీద్ ఖాన్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ కనీసం 150 కూడా స్కోరు చేయదని అనుకుంటున్న తరుణంలో రషీద్ ఖాన్ 10 బంతుల్లో 4 సిక్సులు, రెండు ఫోర్లు బాది 34 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించడంతో పాటు... కీలక సమయంలో 3 వికెట్లు పడగొట్టాడు. అంతే కాకుండా అత్యుతమ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు.

రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుని ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించిన రషీద్ ఖాన్‌పై ఆప్ఘనిస్థాన్ దేశాధ్యక్షుడు ఆష్రఫ్‌ ఘని ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా ఆయన రషీద్‌ ఖాన్ గురించి తన ట్విటర్‌లో రషీద్ ఓ హీర్ అని, అతని ఆట తీరు పట్ల గర్వంగా ఫీలవుతున్నట్లు ట్వీట్‌లో తెలిపారు.

'మా హీరో రషీద్‌ ఖాన్‌ చూసి అప్ఘనిస్థాన్ గర్వపడుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తమ దేశ ఆటగాళ్లకు నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఇచ్చిన భారతీయ స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రషీద్‌ క్రికెట్‌ ప్రపంచానికి దొరికిన అరుదైన సంపద. మోడీ గారు.. రషీద్‌ను మేం ఎవరికీ ఇవ్వలేం' అని ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌ చూసిన తర్వాత చాలా మంది అభిమానులు రషీద్ ఖాన్‌కు భారతీయ పౌరసత్వం ఇవ్వాలని కోరుతూ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ట్వీట్లు పెట్టారు. దీనికి సుష్మా కూడా స్పందించారు. 'మీ అందరి ట్వీట్లు చూశాను. పౌరసత్వానికి సంబంధించి కేంద్ర హోం శాఖ చూసుకుంటుంది' అని సుష్మా స్వరాజ్‌ బదులిచ్చారు.

మరికొంత మంది అభిమానులు అయితే మరో అడుగు ముందుకేసి బీసీసీఐ.. అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి. అదేంటంటే రషీద్‌ ఖాన్‌ను మనం తీసుకుని అతడి స్థానంలో రవీంద్ర జడేజాను అఫ్గానిస్థాన్‌కు ఇవ్వాలి' అని బీసీసీఐకి సలహా ఇచ్చారు.

Story first published: Saturday, May 26, 2018, 11:47 [IST]
Other articles published on May 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+