ఐపీఎల్ 2018: రోహిత్ శర్మ కోసం లంక నుంచి భారత్‌కు ఓ అభిమాని (వీడియో)

హైదరాబాద్: శ్రీలంక వేదికగా ఇటీవల ముగిసిన నిదాహాస్ ట్రోఫీలో టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహారించిన సంగతి తెలిసిందే. పైనల్లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన అనంతరం రోహిత్ శర్మ శ్రీలంక జాతీయ జెండా పట్టుకుని మైదానంలో కలియ తిరుగుతూ సందడి చేసిన తీరు ఇప్పటికీ శ్రీలంక అభిమానులు ప్రతి ఒక్కరికీ గుర్తే.

రోహిత్ శర్మకు అభిమానిగా
ఈ ఒక్క సంఘటనతో శ్రీలంకకు చెందిన ఎంతో మంది క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మకు ఫ్యాన్స్‌గా మారిపోయారు. ఇందులో ఓ అభిమాని ప్రస్తుతం జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసేందుకు శ్రీలంక నుంచి వచ్చాడు. అతడి పేరు మహమ్మద్ నీలమ్.

ముంబై ఆడే ప్రతి మ్యాచ్‌కు సపోర్ట్
శ్రీలంక నుంచి ముంబైకి వచ్చిన అతడు నేరుగా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మను కలిశాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆడే ప్రతి మ్యాచ్‌లకు హాజరవుతూ జట్టును ప్రోత్సహిస్తున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్ అతడికి సంబంధించిన వీడియోని ఫ్యాన్ స్పీక్ పేరిట తన అధికారిక ట్వీట్టర్‌లో పోస్టు చేసింది.
ఐపీఎల్‌లో మ్యాచ్‌లు చూసేందుకు శ్రీలంక నుంచి వచ్చా
ఈ వీడియోలో 'నా పేరు మహమ్మద్ నీలమ్. ఐపీఎల్‌లో మ్యాచ్‌లు చూసేందుకు శ్రీలంక నుంచి వచ్చాను. నా ఫేవరెట్ ఐపీఎల్ జట్టు ముంబw ఇండియన్స్. నా అభిమాన ఆటగాడు రోహిత్ శర్మ. వాంఖడే, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నైలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లను చూశాను. ముంబైలోని వాంఖడే స్టేడియం అంటే నాకిష్టం' అని చెప్పడాన్ని మీరు చూడొచ్చు.

గతంలో చాలా సార్లు రోహిత్ శర్మను కలిసిన నీలమ్
ఇదిలా ఉంటే గతంలో కూడా నీలమ్ చాలా సార్లు రోహిత్ శర్మను కలిశాడు. గతేడాది డిసెంబరులో భారత్ వచ్చి మ్యాచ్ చూసేందుకు డబ్బుల్లేవని తెలుసుకున్న రోహిత్ శర్మ తానే స్వయంగా టిక్కెట్లు కొనుగోలు చేసి పంపించాడు. ఈ ఏడాది శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు నీలమ్ ఇంటికి వెళ్లిన రోహిత్ శర్మ అతని కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications