|
పర్పుల్ క్యాప్‌ని అందుకున్న మయాంక్ మార్కండే
ఇందుకు సంబంధించిన వీడియోని ముంబై ఇండియన్స్ అబిమానుల కోసం తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్లో ముంబై ఇండియన్స్ తరుపున సత్తా చాటుతోన్న ఆటగాళ్లలో మయాంక్ మార్కండే ఒకడు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి మధ్యలో పర్పుల్ క్యాప్‌ను కూడా అందుకున్నాడు. మయాంక్ మార్కండే ధరించే జెర్సీ నంబర్ 11. ఈ నంబరే ఎందుకంటే ఇది తన పుట్టిన తేదీ చెప్పాడు. మయాంక్ మార్కండే 1997 నవంబర్ 11న జన్మించాడు. అందుకే తాను 11వ నంబర్ జెర్సీని ఎంచుకున్నట్లు తెలిపాడు.

రాహుల్ చాహార్ది కూడా ఒకటో నంబర్ జెర్సీనే
మరో ఆటగాడు రాహుల్ చాహార్ది కూడా ఒకటో నంబర్ జెర్సీ కావడం విశేషం. ఒకటి తన లక్కీ నంబర్ అని, అందుకే తాను ఒకటో నంబర్ జెర్సీని ధరిస్తానని చెప్పాడు.

ప్రత్యేకంగా 19 నంబర్ జెర్సీ ఎందుకని ప్రశ్నించగా
ఇక తజీందర్ సింగ్ జెర్సీ కథ మరోలా ఉంది. అతడు ధరించే జెర్సీ నెంబర్ 19. ప్రత్యేకంగా 19 ఎందుకని ప్రశ్నించగా... 'ఇంగ్లిష్‌లో ‘ఎస్' 19వ అక్షరం. నా తల్లి పేరు సర్బజీత్ కౌర్, కోచ్ పేరు సుమీందర్ సింగ్. మీ అందరికీ తెలిసిన నా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. వీరందరి పేరు ‘ఎస్'తోనే ప్రారంభం అవుతోంది. అందుకే 19 నా జెర్సీ నంబర్ అయ్యింది' అని చెప్పాడు.

తజీందర్ సింగ్
మంగళవారం ముంబై Vs బెంగళూరు మ్యాచ్
ఈ సీజన్లో రాహుల్ చాహార్, తజీందర్ సింగ్ ఇప్పటి వరకు ఆడలేదు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్ మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింట ఓటమి పాలై, కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి మూడో స్థానంలో కొనసాగుతోంది.