Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెప్పపాటులో డివిలియర్స్‌ను స్టంపౌట్ చేసిన ధోని (వీడియో)

IPL 2018: Watch how MS Dhonis stumping masterclass caught ABD, M Ashwin napping

హైదరాబాద్: వికెట్ల వెనుక ధోని ఎంత వేగంగా కదులుతాడో మనందరికీ తెలిసిందే. వికెట్ల వెనుక ధోని ఉండగా క్రీజు దాటారంటే మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఐపీఎల్ టోర్నీలో భాగంగా పూణె వేదికగా బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ధోని మరోసారి తన కీపింగ్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.

క్రీజులో చక్కటి పుట్ వర్క్‌ను కనబర్చే ఏబీ డివిలియర్స్‌ను ధోని తన స్టంపింగ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. హర్భజన్‌ సింగ్ వేసిన 8 ఓవర్‌ మూడో బంతికి ఏబీ క్రీజు దాటి రివర్స్‌ స్వీప్‌ ఆడే ప్రయత్నం చేయగా బంతి బ్యాట్‌కు తగలకుండా ధోని చేతిలో పడింది. ఇంకేముంది రెప్పపాటులో బంతిని ధోని వికెట్లను గిరాటేశాడు.

దీంతో ఏబీ డివిలియర్స్ (1) వద్ద నిరాశగా పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బెంగళూరు బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన ఓపెనర్ పార్థీవ్ పటేల్ (53: 41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడం... కెప్టెన్ విరాట్ కోహ్లి (8), మెక్‌కలమ్ (5), ఏబీ డివిలియర్స్ (1) నిరాశపరిచారు.

దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులకే పరిమితమైంది. దీంతో చెన్నైకి 128 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు సత్తా చాటారు. చెన్నై బౌలర్లలో జడేజా 3, హర్భజన్ సింగ్ 2, డేవిడ్ విల్లీ, లుంగీ ఎంగిడి తలో వికెట్ తీసుకున్నారు.

Story first published: Saturday, May 5, 2018, 18:14 [IST]
Other articles published on May 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+