
హైదరాబాద్: ఐపీఎల్ పుణ్యమా అని అంతర్జాతీయ క్రికెటర్లు కుటుంబ సమేతంగా వేసవి విడిదిని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ధోనీ కూతురు కూడా క్రికెట్ మైదానంలో.. ధోనీ చేతుల్లో ఆడుకుంటూ సరదాగా గడిపేస్తుంది. ఈ మధ్య ఆ చిన్నారి చేసిన మరో పనికి మహేంద్రసింగ్ ధోనీ మురిసిపోతున్నాడు. తండ్రిని మించిన కూతురంటూ ఈ ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంటున్నాడు.
ఇప్పుడు జీవా డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతోంది. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంటోంది ధోనీ కూతురు జీవా. మ్యాచ్ తర్వాత ఖాళీ దొరికిన సమయంలో ధోనీ కూతురితో గడిపాడు. హోటల్ గదిలో ఓ పాటను ప్లే చేయగా... జీవా డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. ఈ సీన్ మొత్తాన్ని వీడియో తీసి... ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. నా కంటే జీవానే బాగా డ్యాన్స్ చేస్తోందంటూ తన ఆనందాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ పోస్ట్ పెట్టాడు.
జీవా వీడియోకు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పోస్ట్ పెట్టిన రెండు గంటల్లోనే ఏడు లక్షల మంది లైక్ చేశారు. క్యూట్... డ్యాన్స్ భలే చేస్తుందే అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ధోనీ కూతురు జీవాతో కలిసి రైనా, హర్భజన్ సింగ్‌ల ఇద్దరి కూతుళ్లు గ్రేసియా, హినాయా కలిసి సరదాగా గడిపేస్తున్నారు. దాంతో పాటుగా జీవా, గ్రేసియా ఇద్దరూ ట్యాబ్ లలో ఆడుకుంటున్న ఫొటో ఒకటి పోస్టు చేసి వాళ్లిద్దరూ గత రాత్రి జరిగిన మ్యాచ్ హైలెట్స్ చూస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. రింగ రింగా రోసెస్.. అంటూ ముద్దుగా అడుకుంటున్న వీరు చాలా ఎంజాయ్ చేశారని రైనా ట్విటర్‌లో పేర్కొన్నాడు.