
హైదరాబాద్: వీరేంద్ర సెహ్వాగ్... భారత క్రికెట్‌కు దూకుడు నేర్పిన డాషింగ్ ఓపెనర్. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్‌లో తనదైన శైలిలో అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్ 11వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మెంటార్‌గా వ్యవహారిస్తున్నాడు.
టోర్నీలో భాగంగా గత ఆదివారం పంజాబ్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చెన్నైపై పంజాబ్ 4 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం సెహ్వాగ్ తనను కలిసేందుకు సుదూర ప్రాంతం నుంచి వచ్చిన అభిమాని పాదాలకు వందనం చేశాడు.
వివరాల్లోకి వెళితే పటియాలకు చెందిన 93 ఏళ్ల ఓం ప్రకాశ్ అనే వ్యక్తి సెహ్వాగ్‌కు వీరాభిమాని. మంగళవారం చండీఘడ్‌లో తన అభిమాన క్రికెటర్ సెహ్వాగ్‌ను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా పెద్దల పట్ల తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఓం ప్రకాశ్ కాళ్లు మొక్కి సెహ్వాగ్ ఆయన దీవెనలు అందుకున్నారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన ట్విటర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. సెహ్వాగ్ సైతం తన 93 ఏళ్ల సీనియర్ అభిమానితో దిగిన సెల్ఫీని ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ 'దాదా కో ప్రణామ్' అంటూ ట్వీట్ చేశాడు. టోర్నీలో భాగంగా పంజాబ్ తన తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతాతో శనివారం తలపడనుంది.