ఐపీఎల్ 2018: కోహ్లీ, చాహల్, మెక్‌కల్లమ్ ఫన్నీ డ్యాన్స్ వీడియో చూశారా?


హైదరాబాద్: అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా ప్రాంఛైజీలకు చెందిన ఆటగాళ్లు జట్టులో చేరి ప్రాక్టీస్‌తో బిజీగా గడుపుతున్నారు. పగలంతా ప్రాక్టీస్ చేసి, సాయంత్రం జట్టులోని ఆటగాళ్లంతా కలిసి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతున్నారు.

ఫోటో షూట్లలో బిజీగా ఆటగాళ్లు
మరోవైపు సమయం దొరికినప్పుడు ఆయా జట్ల ఫ్రాంఛైజీల ఫొటో షూట్లలో పాల్గొంటున్నారు. రెండేళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫోటో షూట్లతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే ఆ జట్టుకు సంబంధించిన అనేక ఫోటో షూట్లు అభిమానులను అలరిస్తున్నాయి.

కోహ్లీ డ్యాన్స్ చూసిన నవ్వు ఆపుకోలేక పోయిన చాహల్
తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంఛైజీ తమ జట్టులోని ఆటగాళ్లతో కలిసి ఓ ప్రోమోని సిద్ధం చేసింది. ఈ ప్రోమోలో విరాట్ కోహ్లీ, యజువేంద్ర చాహల్, బ్రెండన్ మెకల్లమ్‌లు డ్యాన్స్ చేశారు. మ్యూజిక్‌కు అనుగుణంగా ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేస్తుండగా దానిని చూసిన చాహల్ నవ్వు ఆపుకోలేకపోయాడు.
ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్న చాహల్
చాహల్ నవ్వడాన్ని చూసిన కోహ్లీ కూడా ఒక్కసారిగా నవ్వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చాహల్ తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఐపీఎల్ కోసం దిగ్గజ ఆటగాళ్లు కోహ్లీ, మెకల్లమ్‌తో వార్మప్ చేస్తున్నాను' అని పేర్కొన్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications