న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గూగుల్ సీఈవో ట్వీట్‌కు స్పందించిన విరాట్ కోహ్లీ

IPL 2018: Virat Kohli Responds To Google CEO Sundar Pichai’s Tweet. Heres What He Said

హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన మ్యాచ్‌ గురించి గూగుల్ సీఈవో స్పందించాడు. ఈ మ్యాచ్‌ను లైవ్‌లో చూడటం అదృష్టమని పేర్కొన్నాడు. మే 13వ తేదీ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడిన బెంగళూరు జట్టు.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు 181 పరుగులతోనే ఢిల్లీ జట్టును కట్టడి చేయగలిగింది. అనంతరం చేధనలో బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఇరగదీసి ఆడటంతో 187 పరుగులతో 5 వికెట్లతో విజయం పొందింది.

ఈ మ్యాచ్‌లో ఇరగదీసి ఆడిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 40బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. అతనితో పాటు మరో ఎండ్‌లో డివిలియర్స్ కూడా అదే స్థాయిలో రెచ్చిపోయాడు. ఒకానొక దశలో విరాట్ అవుట్ అయి వెనుదిరగడంతో బాధ్యతనంతా డివిలియర్స్ తీసుకుని జట్టును గెలిపించాడు. ఆ రోజు జరిగిన మ్యాచ్‌తో బెంగళూరు మళ్లీ ప్లేఆఫ్ రేసుకు వచ్చేస్తుందన్న నమ్మకం కలిగింది.

ఆ రోజు సాధారణ అభిమానిగా మ్యాచ్ వీక్షించిన సుందర్ పిచాయ్ డివిలియర్స్, కోహ్లీ ప్రదర్శనలకు ముగ్దుడైయ్యాడు. మ్యాచ్ అనంతరం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించాడు. 'అదృష్టం కొద్దీ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడగలుగుతున్నా.. డివిలియర్స్ ఆట తీరు చాలా చక్కగా అనిపించింది. ఈ సంవత్సరం ఐపీఎల్‌ను నిజంగా ఎంజాయ్ చేస్తున్నా.' అని ట్వీట్ చేశాడు. దానికి స్పందించిన కోహ్లీ ఐదు రోజులు ఆలస్యంగా 'థాంక్యూ.. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసినందుకు సంతోషంగా భావిస్తున్నాం.' అంటూ బదులిచ్చాడు.

అయితే పిచాయ్ చేసిన ట్వీట్‌కు ఆయన అభిమాని మరొకరు 'పిచాయ్ గారూ.. మీకున్న క్షణం తీరిక లేకుండా గడిపే మీరు. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు సమయం ఎలా దొరికింది. అంటూ ప్రశ్నించారు. ఆ ట్వీట్‌కు బదులుగా పిచాయ్ మ్యాచ్ జరుగుతున్న సమయం ఇక్కడ సరిగా శనివారం ఉదయం అందుకే చూడడం కుదిరింది' అని పేర్కొన్నాడు.

Story first published: Sunday, May 20, 2018, 16:41 [IST]
Other articles published on May 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X