ఇలాగైతే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేం:: విరాట్ కోహ్లీ ఎమోషనల్

హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగేనని ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. టోర్నీలో భాగంగా ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ 'మా జట్టు ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగే. ప్రతీ మ్యాచ్ నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అనుకున్న దాని కన్నా మంచి స్కోర్ సాధిస్తున్నాం' అని అన్నాడు.
'కానీ ఓటమి తప్పడం లేదు. ఈ మ్యాచ్‌లో వికెట్లు కోల్పోతున్న తరుణంలో 165 పరుగులు చేసినా ఎక్కువే అనుకున్నాం. కానీ అదనంగా పది పరుగులు లభించాయి. మంచి స్కోర్ సాధించినప్పటికీ మ్యాచ్ కాపాడుకోలేకపోయాం. మా ఫీల్డింగ్ సరిగా లేదు' అని కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు.

విజయానికి మేము అర్హులం కాదు
'సింగిల్స్‌ను బౌండరీలుగా మార్చడాన్ని ఆపలేకపోయాం. ఇలా అయితే విజయానికి మేము అర్హులం కాదు. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మరింత శ్రమించాల్సి ఉంది. ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట విజయం సాధించాలి. దానిని దృష్టిలో పెట్టుకుని ప్రతి మ్యాచ్‌ని సెమీ పైనల్ మ్యాచ్‌లా ఆడతాం' అని కోహ్లీ అన్నాడు.

175 పరుగులు చేసిన బెంగళూరు
ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు క్రిస్ లిన్(62), నరైన్ (27) చక్కటి శుభారంభం ఇచ్చారు.

పవర్‌ప్లేలో 51 పరుగులు చేసిన కోల్‌కతా
దీంతో పవర్‌ప్లేలో కోల్‌కతాకు 51 పరుగులు వచ్చాయి. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తనకు లభించిన లైఫ్‌ని క్రిస్ లిన్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించాక నరైన్ ఔటైనా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాబిన్ ఊతప్ప(36)తో కలిసి స్కోరు బోర్డుని పరిగెత్తించాడు.

హాఫ్ సెంచరీతో రాణించిన క్రిస్ లిన్
ఈ ఇద్దరూ వరుస బౌండరీలతో విరుచుకుపడటంతో 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. ఆ తర్వాత మరో ఇరవై పరుగులు జోడించాక మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో రాబిన్ ఉతప్ప పెవిలియన్‌కు చేరాడు. ఈ దశలో క్రిస్ లిన్ 42 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన నితీష్ రాణా
అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా(15) పరుగుల వద్ద 17వ ఓవర్లో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రసెల్ (0) తొలి బంతికే ఔటయ్యాడు. దీంతో బెంగళూరు శిబిరంలో ఆశలు చిగురించాయి. ఈ సమయంలో విజయానికి 3 ఓవర్లలో 29 పరుగులు అవసరం కాగా... లిన్‌తో కలిసి కెప్టెన్ దినేశ్ కార్తీక్ చెలరేగాడు. చివరి ఓవర్ తొలి బంతిని శుభమాన్ గిల్(5 నాటౌట్) బౌండరీకి తరలించి కోల్‌కతాకు విజయాన్ని అందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications