బ్రేక్ సమయంలో అంపైర్ పైకి బంతి విసిరేసిన ముంబై ఫీల్డర్..!

Posted By:
IPL 2018 SRH vs MI: Umpire Gets Injured After Ball Hits Him On Head
 IPL 2018: Umpire CK Nandan escapes major head injury

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ లో భాగంగా జరిగిన ఏడో మ్యాచ్ లో పెద్ద పొరబాటు జరిగింది. అనుకోకుండా ముంబై జట్టు ఆటగాడు విసిరిన బంతి అంపైర్ తల మీద పడింది. ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్‌ సీకే నందన్ తలపైకి పొరపాటున ముంబై ఇండియన్స్ ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్ బంతిని విసిరాడు.

బంతి తక్కువ ఎత్తు నుంచి రావడంతో అతనికి ఎలాంటి గాయమవలేదు. కానీ.. నొప్పి ఉండటంతో కాసేపు ఐస్‌బ్యాగ్‌ని నందన్ తన తలపై ఉంచుకుని ఉపశమనం పొందాడు. అసలెలా జరిగిందంటే..

లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ జట్టు:

ఈ మ్యాచ్‌లో 148 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 5.5 ఓవర్లు ముగిసే సమయానికి 52/0తో నిలిచింది. ఈ దశలో.. ముంబై ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా విసిరిన బంతిని ధావన్ హిట్ చేసేందుకు క్రీజు వదిలి వెలుపలికి వచ్చాడు. దీంతో బ్యాట్ అంచున తాకిన బంతి...డీప్‌ఫైన్‌లెగ్ దిశగా బౌండరీకి వెళ్లిపోయింది.

 బ్రేక్ కోరిన రోహిత్ శర్మ:

బ్రేక్ కోరిన రోహిత్ శర్మ:

ఫీల్డర్ ఎవరూ బౌండరీ లైన్‌కి సమీపంలో లేకపోవడంతో.. ముంబై ఇండియన్స్ డగౌడ్‌లోకి వెళ్లిన బంతిని రిజర్వ్ బెంచ్‌లోని ఆటగాళ్లు మైదానంలోని ఫీల్డర్ సూర్యకుమార్ యాదవ్‌కి అందించారు. ఈ బంతితో 6 ఓవర్లు ముగియడంతో.. ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్ట్రాటెజిక్ టైమ్ అవుట్ (బ్రేక్) కోరాడు. దీంతో.. ఫీల్డ్ అంపైర్ నందన్ బ్రేక్ సిగ్నల్ ఇచ్చి పక్కకి వచ్చిన క్షణాల వ్యవధిలోనే అతని తలపై బంతి పడింది.

బ్రేక్ సమయంలో బంతిని అంపైర్‌కి ఇచ్చేయాలని:

బ్రేక్ సమయంలో బంతిని అంపైర్‌కి ఇచ్చేయాలని:

క్రికెట్ నిబంధనలను అనుసరించి బ్రేక్ సమయంలో బంతిని అంపైర్‌కి ఇచ్చేయాలి. దీంతో.. సూర్యకుమార్ యాదవ్ అంపైర్ నందన్‌కి బంతిని ఇచ్చే ఉద్దేశంతో విసరగా.. అది వెళ్లి.. నందన్ తలపై పడింది. పొరపాటుగా జరిగిన విషయం కావడంతో.. అంపైర్లు సూర్యకుమార్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

చివరి వరకు ఉత్కంఠతతో:

చివరి వరకు ఉత్కంఠతతో:

ఉత్కంఠభరిత పోరులో సన్‌రైజర్స్‌ ఒక వికెట్‌ తేడాతో తేడాతో ముంబైపై గెలుపొందింది. మొదట ముంబై.. 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసి ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. శిఖర్‌ ధావన్‌ 28 బంతుల్లో (45) మరోసారి సత్తాచాటగా.. దీపక్‌ హుడా 25 బంతుల్లో (32) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, April 13, 2018, 12:05 [IST]
Other articles published on Apr 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి