For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎంగిడి పొరబాటు, బెంగళూరు జట్టుకు భారీ మూల్యం అనుభవించాల్సి వచ్చిందా..?

 IPL 2018: Total Chaos As Mohammad Siraj Survives A Run-Out Despite Falling On The Pitch

హైదరాబాద్: పూణె వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ప్లే ఆఫ్‌ బరిలో నిలిచేందుకు తప్పనిసరిగా మ్యాచ్‌లో గెలవాల్సిన పరిస్థితుల్లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతులెత్తేసింది. దాదాపు అభిమానుల ఆశలను ఆవిరి చేసింది. అయితే టోర్నీ ఆరంభం నుంచి బలహీనంగా కనిపిస్తున్న చెన్నై బౌలర్లు..ఆర్‌సీబీతో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

 తొలి మ్యాచ్ నుంచి విఫలమవుతూ..తీవ్ర స్థాయిలో విమర్శలు

తొలి మ్యాచ్ నుంచి విఫలమవుతూ..తీవ్ర స్థాయిలో విమర్శలు

ఎదుర్కొంటున్న స్పిన్నర్‌ జడేజా ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. నాలుగు ఓవర్లు విసిరి కేవలం 18పరుగులిచ్చి..ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. అందులోనూ ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ 11బంతుల్లో (8) వికెట్‌ మాత్రం అతనికెంతో ప్రత్యేకం. జడేజాతో పాటు జట్టులో మిగతా బౌలర్లంతా కట్టుదిట్టంగా బంతులు విసరడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 127పరుగులు మాత్రమే చేసింది.

సిరాజ్‌ ఒక్కసారిగా పట్టుతప్పి అక్కడే కుప్పకూలి..:

సిరాజ్‌ ఒక్కసారిగా పట్టుతప్పి అక్కడే కుప్పకూలి..:

బెంగళూరు ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ డ్వేన్‌ బ్రావో బౌలింగ్‌లో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఆ ఓవర్‌లో బ్రావో వేసిన రెండో బంతిని ఎదుర్కొన్న టిమ్‌ సౌథీ షార్ట్‌ ఫైన్‌ లెగ్‌ మీదుగా బాదాడు. అయితే షాట్‌ సరిగా తగలకపోవడంతో బంతి నిదానంగా అక్కడే ఫీల్డింగ్‌లో ఉన్న లుండి ఎంగిడి వైపుగా వెళ్లింది. దీంతో అవతలి ఎండ్‌ క్రీజులో ఉన్న మహ్మాద్‌ సిరాజ్‌.. సింగిల్‌ కోసమని ప్రయత్నించి దాదాపు స్ట్రెకింగ్ ఎండ్‌ వైపుగా వచ్చేశాడు. కానీ రన్‌ సాధ్యపడదని గుర్తించి.. సిరాజ్‌ వెంటనే నాన్‌స్ట్రెక్‌ ఎండ్‌కు వచ్చే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో సిరాజ్‌ ఒక్కసారిగా పట్టుతప్పి అక్కడే కుప్పకూలిపోయాడు.

మైదానంలో ప్రతిఒక్కరూ నవ్వుకున్నారు :

మరోవైపు బంతి అందుకున్న ఎంగిడి సైతం సరిగ్గా బ్రావోకి చేతికి అందించలేక కాస్త తడబడ్డాడు. ఈలోగా సిరాజ్‌ కోలుకోని క్రీజులోకి రావడంతో రనౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే ఎంగిడి బంతి అందించిన విధానాన్ని చూస్తే మైదానంలో ప్రతిఒక్కరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత చివరి బంతికి సిరాజ్‌ (3; 7బంతుల్లో) మళ్లీ రనౌట్‌గానే వెనుదిరగడం..బంతులు కూడా పూర్తి కావడంతో ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

 ఆర్‌సీబీ తరఫున తొమ్మిదో వికెట్‌కు అత్యధిక పరుగుల

ఆర్‌సీబీ తరఫున తొమ్మిదో వికెట్‌కు అత్యధిక పరుగుల

భాగస్వామ్యం సౌథీ-సిరాజ్‌ జోడీ నెలకొల్పారు. బ్యాట్స్‌మెన్‌ ఎం.అశ్విన్‌ (1) ఔట్‌ అయిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టిమ్‌ సౌథీ 26బంతుల్లో (36)దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును వందపరుగుల మార్కు దాటించాడు. ఈ క్రమంలో తొమ్మిదో వికెట్‌కు మొహమ్మద్ సిరాజ్‌తో కలిసి 38 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి తొమ్మిదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం (35పరుగులు) రాహుల్‌ ద్రవిడ్‌-కుంబ్లే(2008) జోడీ పేరిట ఉంది.

Story first published: Sunday, May 6, 2018, 14:16 [IST]
Other articles published on May 6, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+