Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: ధోని పక్కన ఉన్న ఆ మిస్టరీ గర్ల్ ఎవరో తెలిసింది

IPL 2018: The Mystery girl’s identity revealed

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం పూణె వేదికగా ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కెమెరామెన్ ఓ అందమైన అమ్మాయిని పదే పదే స్టేడియంలోని స్క్రీన్లపై చూపించడం ప్రారంభించాడు.

ముఖ్యంగా చెన్నై ఇన్నింగ్స్ సమయంలో ఆ అమ్మాయి ప్రదర్శించిన హావభావాలు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి. ఆ తర్వాత ఆమ్మాయి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మిస్టరీ గర్ల్ ఎవరో తెలిసింది

ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆడే మ్యాచ్‌లకు హాజరవుతా ఆ జట్టును ప్రోత్సహిస్తూ టీవీలో తరచూ కనిపిస్తుండటంతో ఆ మిస్టరీ గర్ల్ ఎవరనే ప్రశ్న సగటు క్రికెట్ ప్రేమికుడి మదిలో మొదలైంది. చివరకు ఈ మిస్టరీ గర్ల్ ఎవరో ఇప్పుడు తెలిసిపోయింది.

పేరు మాలతి చాహార్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహార్‌ ఉన్నాడు కదా... అతని సోదరే ఈ అమ్మాయి. పేరు మాలతి చాహార్‌. శనివారం పూణెలోని ఎంసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌కి హాజరైంది. మాలతి చాహార్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి వీరాభిమాని.

ధోనికి వీరాభిమాని

అయితే, ఇంతవరకు ఆమె ధోని కలవలేదు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐపీఎల్‌ వేలంలో చాహార్‌ని చెన్నై కొనుగోలు చేయడం.. ఆ తర్వాత చెన్నై జట్టు ఆడే మ్యాచ్‌లకు మాలతి హాజరవ్వడం, తాజాగా ధోనీని కలిసి ఫోటో దిగింది. ఇదిలా ఉంటే, మాలతి చాహార్‌కు మరొక సోదరుడు ఉన్నాడు.

మరొక సోదరుడు ముంబై ఇండియన్స్ తరుపున

పేరు రాహుల్. లెగ్ స్పిన్నర్. అతడు కూడా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ల్లో ఆడేందుకు అతడికి అవకాశం లభించలేదు. గతేడాది వీరిద్దరూ రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.

ఐపీఎల్‌కు రెండు వారాలు చాహార్ దూరం

ఐపీఎల్‌కు రెండు వారాలు చాహార్ దూరం

ఇదిలా ఉంటే గాయం కారణంగా దీపక్‌ చాహార్‌ రెండు వారాల పాటు ఐపీఎల్‌కు దూరమైనట్లు ఆ జట్టు కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తెలిపాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఐదో ఓవర్‌లో బంతి అందుకున్న చాహార్‌ తొలి బంతి విసరగానే గాయంతో బాధపడుతూ మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లాడిన చాహార్‌ 6 వికెట్లు తీశాడు.

Story first published: Monday, April 30, 2018, 15:08 [IST]
Other articles published on Apr 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+