Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

5 మ్యాచ్‌ల్లో 8 డకౌట్‌లు: ముంబై ఖాతాలో ఓ చెత్త రికార్డు

Ipl 2018 The Golden Duck Record Of Mumbai Indians

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో ఢిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ అత్యంత పేలవ ప్రదర్సనను కనబరుస్తోంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.

ముంబై ఖాతాలో ఓ చెత్తరికార్డు

ముంబై ఖాతాలో ఓ చెత్తరికార్డు

ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఐదు మ్యాచ్‌లు ఆడగా అందులో 8 డకౌట్లు నమోదు చేసింది. ఇలాంటి చెత్త రికార్డు ఐపీఎల్ 11వ సీజన్‌లో మరో జట్టు నమోదు చేయకపోవడం విశేషం.

చెన్నైతో తొలి మ్యాచ్

చెన్నైతో తొలి మ్యాచ్

ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో వాంఖడె స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో దీపక్‌ చాహర్‌ వేసిన బంతికి డకౌట్‌ అయ్యాడు ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన రెండో పోరులో ప్రదీప్‌ సంగ్వాన్‌ డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

వరుస బంతుల్లో గోల్డెన్‌ డక్స్‌

వరుస బంతుల్లో గోల్డెన్‌ డక్స్‌

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో కీరన్‌ పొలార్డ్‌.. క్రిష్టియన్‌ వేసిన తొలి బంతికే పెవిలియన్‌కు చేరాడు. ఇక, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్య కుమార యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ను వరుస బంతుల్లో గోల్డెన్‌ డక్స్‌గా ఉమేశ్‌ యాదవ్‌ పెవిలియన్‌కు పంపించాడు.

 ముంబై ఆడిన 5 మ్యాచ్‌ల్లో 8 డకౌట్‌లు నమోదు

ముంబై ఆడిన 5 మ్యాచ్‌ల్లో 8 డకౌట్‌లు నమోదు

అయితే ఈ మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ రోహిత్‌ శర్మ (94), ఎవిన్ లూయిస్‌ (65) విజృంభణతో ముంబై ఘన విజయం సాధించింది. ఇక, రాజస్థాన్‌‌తో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌ ఇవిన్‌ లూయిస్‌, కెప్టెన్ రోహిత్‌ శర్మ ఎదుర్కొన్న తొలి బంతులకే పెవిలియన్‌కు చేరారు. దీంతో ఈ సీజన్‌లో ముంబై ఆడిన 5 మ్యాచ్‌ల్లో 8 డకౌట్‌లు నమోదయ్యాయి.

Story first published: Monday, April 23, 2018, 21:11 [IST]
Other articles published on Apr 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+