ఐపీఎల్ 2018: కొత్త కెప్టెన్లతో హైదరాబాద్, రాజస్థాన్ ఎంతవరకు రాణించగలవో..?

Posted By:
IPL 2018: Sunrisers Hyderabad vs Rajasthan Royals Match Preview
IPL 2018: Sunrisers Hyderabad predicted XI

హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం జరిగిన బాల్ ట్యాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా జట్టుతో పాటు ఐపీఎల్‌ను సైతం గాబరా పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్‌లో కెప్టెన్లు వ్యవహరిస్తారనుకున్న డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ పూర్తి టోర్నీకే దూరమైయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త కెప్టెన్లతో ఐపీఎల్ ఆడేందుకు ఇరుజట్లు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సిద్ధమవుతున్నాయి.

రాజస్థాన్‌కు స్మిత్‌ , హైదరాబాద్‌కు వార్నర్‌ లేని లోటును కొత్త కెప్టెన్లు అధిగమిస్తారా.. లేదా అనేది సందిగ్ధం. హైదరాబాద్ జట్టుకు మాత్రం విలియమ్సన్ న్యాయం చేయగలడంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రాజస్థాన్ పగ్గాలు రహానె అప్పగించింది ఆ జట్టు యాజమాన్యం.

వార్నర్ లోటు తీర్చగలడా అనే సందేహంలోనే:

వార్నర్ లోటు తీర్చగలడా అనే సందేహంలోనే:

ఒకప్పుడు సన్‌రైజర్స్‌ అనగానే వార్నర్‌ గుర్తొచ్చే వాడు. అతని కుటుంబంతో సహా స్టేడియంలో హాజరై సందడి చేసేవారు. జట్టుపై అలాంటిది వార్నర్‌ ముద్ర ఇప్పుడు ఉండదు. అతని గైర్హాజరీలో నాయకత్వ బాధ్యతలు విలియమ్సన్‌ చూసుకోనున్నాడు. ఐతే బ్యాట్స్‌మన్‌గా వార్నర్‌ లోటును భర్తీచేసే ఆటగాడు ఎవరన్నది ఇప్పటికీ జవాబు లేని ప్రశ్నే. వార్నర్‌ స్థానంలో ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడని అనుకుంటున్న అలెక్స్‌ హేల్స్‌పై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ఎటొచ్చి శిఖర్‌ ధావన్‌నే సన్‌రైజర్స్‌ నమ్ముకోనుంది.

వార్నర్‌ తర్వాత క్రియాశీల పాత్ర ధావన్‌దే:

వార్నర్‌ తర్వాత క్రియాశీల పాత్ర ధావన్‌దే:

కొన్ని సీజన్‌లుగా వార్నర్‌ తర్వాత జట్టు బ్యాటింగ్‌లో క్రియాశీల పాత్ర ధావన్‌దే. వార్నర్‌ తర్వాత అత్యధిక పరుగులు అతనివే. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌లో ధావన్‌ బాధ్యత మరింత పెరగనుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో పరుగుల వరద పారించి మంచి ఫామ్‌లో ఉన్న ధావన్‌.. ఐపీఎల్‌లోనూ ఫామ్‌ కొనసాగిస్తాడా అన్నది చూడాలి. కెప్టెన్‌ విలియమ్సన్‌, స్టార్‌ ఆటగాడు మనీష్‌ పాండే, యూసుఫ్‌ పఠాన్‌, దీపక్‌ హుడా, వృద్ధిమాన్‌ సాహాలు బ్యాటింగ్‌ భారాన్ని పంచుకోనున్నారు.

భువనేశ్వర్‌ ఈసారి బౌలింగ్‌ విభాగానికి:

భువనేశ్వర్‌ ఈసారి బౌలింగ్‌ విభాగానికి:

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ బలం.. బౌలింగే. పదునైన పేసర్లు.. నాణ్యమైన స్పిన్నర్లతో ప్రత్యర్థిని కట్టడి చేయగలగడం ఆ జట్టు ప్రత్యేకత. ఈసారి కూడా సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ కూర్పు బాగుంది. గత రెండు సీజన్‌లలో అత్యధిక వికెట్లతో నీలి రంగు క్యాప్‌లను అందుకున్న భువనేశ్వర్‌ ఈసారి కూడా సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. భువితో పాటు లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌, పేసర్లు బాసిల్‌ థంపి, సిద్ధార్థ్‌ కౌల్‌, సందీప్‌శర్మలతో బౌలింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది.

బౌలింగ్‌, ఫీల్డింగ్‌ పరంగా సన్‌రైజర్స్‌కు షకీబ్‌:

బౌలింగ్‌, ఫీల్డింగ్‌ పరంగా సన్‌రైజర్స్‌కు షకీబ్‌:

గత వేలం ద్వారా సన్‌రైజర్స్‌ జట్టులోకొచ్చిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్ అల్‌ హసన్‌ ఆరెంజ్‌ ఆర్మీకి అదనపు బలమే. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ పరంగా సన్‌రైజర్స్‌కు షకీబ్‌ తిరుగులేని ఆటగాడే. షకీబ్‌, బ్రాత్‌వైట్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిస్తే సన్‌రైజర్స్‌కు ఎదురుండకపోవచ్చు!

స్టోక్స్‌ సత్తాచాటేనా:

స్టోక్స్‌ సత్తాచాటేనా:

స్పాట్‌ ఫిక్సింగ్‌ వివాదంలో చిక్కుకుని ఐపీఎల్‌కు దూరమైన రాజస్థాన్‌కు రెండేళ్ళ తర్వాత ఇదే తొలి మ్యాచ్‌. రెండేళ్ళ విరామం తర్వాత పునరాగమనం చేసిన రాజస్థాన్‌కు ఆదిలోనే స్మిత్‌ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. స్మిత్‌ గైర్హాజరీలో రహానె జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ రాజస్థాన్‌ జట్టులో స్టార్‌ ఆటగాడు. ఐతే వివాదాలతో జట్టుకు దూరమై ఇటీవలే పునరాగమనం చేసిన స్టోక్స్‌ ఏమేరకు రాణిస్తాడన్నది చూడాలి. ఇక రూ.11.5 కోట్లతో దక్కించుకున్న పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ తన ధరకు న్యాయం చేయగలడా అన్నది ఆసక్తికరం.

జట్లు:
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:
విలియమ్సన్‌ (కెప్టెన్‌), ధావన్‌, మనీష్‌ పాండే, భువనేశ్వర్‌, సాహా (వికెట్‌ కీపర్‌), సిద్ధార్థ్‌ కౌల్‌, దీపక్‌ హుడా, ఖలీల్‌ అహ్మద్‌, సందీప్‌శర్మ, యూసుఫ్‌ పఠాన్‌, శ్రీవత్స్‌ గోస్వామి, రిక్కీ భుయ్‌, బాసిల్‌ థంపి, నటరాజన్‌, సచిన్‌ బేబి, బిపుల్‌శర్మ, మెహదీ హసన్‌, తన్మయ్‌ అగర్వాల్‌, అలెక్స్‌ హేల్స్‌, బ్రాత్‌వైట్‌, రషీద్‌ఖాన్‌, షకీబల్‌ హసన్‌, మహ్మద్‌ నబి, క్రిస్‌ జోర్డాన్‌, బిల్లీ స్టాన్‌లేక్‌

రాజస్థాన్‌ రాయల్స్‌: రహానె (కెప్టెన్‌), అంకిత్‌శర్మ, సంజు శామ్సన్‌, బెన్‌ స్టోక్స్‌, ధవల్‌ కులకర్ణి, జోఫ్రా ఆర్చర్‌, షార్ట్‌, దుష్మంత చమీర, స్టువర్ట్‌ బిన్నీ, శ్రేయస్‌ గోపాల్‌, మిథున్‌, ఉనద్కత్‌, బెన్‌ లాహ్లిన్‌, ప్రశాంత్‌ చోప్రా, కృష్ణప్ప గౌతమ్‌, మహిపాల్‌, జతిన్‌ సక్సేనా, అనురీత్‌సింగ్‌, ఆర్యమన్‌ బిర్లా, జోస్‌ బట్లర్‌, హెన్రిచ్‌ క్లాసన్‌, జహీర్‌, రాహుల్‌ త్రిపాఠి

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 9, 2018, 11:45 [IST]
Other articles published on Apr 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి