న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రికార్డు కోసం రైజర్స్, ప్లేఆఫ్ చాలంటూ రాయల్ బెంగళూరు

IPL 2018: Sunrisers Hyderabad Look to Set Record; RCB Fight for Survival

హైదరాబాద్: ఐపీఎల్ లో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. పూర్తిగా ఆశలు వదిలేసుకున్న ముంబై, బెంగళూరు జట్లు తిరిగి పుంజుకుంటున్నాయి. ఆరంభంలో సూపర్‌గా రాణించిన పంజాబ్ వంటి జట్లు నీరుగారుస్తున్నాయి. ఈ క్రమంలో వరుసగా రెండు విజయాలు సాధించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది కోహ్లి సేన. ఈ జట్టు గురువారం రాత్రి సన్‌రైజర్స్‌తో పోరుకు సిద్ధపడుతోంది.

ప్లేఆఫ్‌ అవకాశాలను నిలుపుకోవాలని

ప్లేఆఫ్‌ అవకాశాలను నిలుపుకోవాలని

12 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ మరో విజయం కోసం బరిలో దిగనుండగా.. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ప్లేఆఫ్‌ అవకాశాలను నిలుపుకోవాలని బెంగళూరు భావిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ 10 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఓ దశలో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించినట్లు కనిపించింది.

ఢిల్లీ, పంజాబ్‌లపై గెలవడం ద్వారా

ఢిల్లీ, పంజాబ్‌లపై గెలవడం ద్వారా

కానీ ఢిల్లీ, పంజాబ్‌లపై గెలవడం ద్వారా తిరిగి పోటీలోకి వచ్చింది. , రాజస్థాన్‌లతో జరిగే చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలవడం ద్వారా టాప్-4లో నిలవాలని కోహ్లి సేన భావిస్తోంది. మరోవైపు హైదరాబాద్ జట్టు చివరి రెండు మ్యాచ్‌ల్లో బెంగళూరు, కోల్‌కతాలపై గెలవడం ద్వారా అత్యధిక లీగ్ విజయాలతో ప్లేఆఫ్ చేరాలని భావిస్తోంది.

 11 విజయాలతో లీగ్ దశను ముగించి:

11 విజయాలతో లీగ్ దశను ముగించి:

2008లో రాజస్థాన్, 2014తో పంజాబ్ 11 విజయాలతో లీగ్ దశను ముగించాయి. చివరి రెండు మ్యాచ్‌లను గెలవడం ద్వారా ఆ రికార్డును సమం చేయాలని సన్‌రైజర్స్ పట్టుదలతో ఉంది. సన్‌రైజర్స్ బ్యాటింగ్ భారాన్ని విలియమ్సన్, ధావన్ మోస్తుండగా.. బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. మధ్య ఓవర్లలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడుతున్నారు.

జట్టు విజయావకాశాలు ఆధారపడి

జట్టు విజయావకాశాలు ఆధారపడి

హైదరాబాద్ వేదికగా మే7వ తేదీ జరిగిన మ్యాచ్‌లోనూ ఓ దశలో 55/1తో పటిష్టంగా కనిపించిన బెంగళూరు.. సన్‌రైజర్స్ బౌలర్ల దెబ్బకు 85 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. గురువారం నాటి మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లను కోహ్లి సేన ఎలా ఎదుర్కొంటుదనే అంశంపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Story first published: Thursday, May 17, 2018, 15:49 [IST]
Other articles published on May 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X