Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: 'వార్నర్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు ఉన్నారు'

David Warner

హైదరాబాద్: బాల్ టాంపరింగ్‌కు పాల్పడి దేశం పరువు తీసిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయంతో ఐపీఎల్ నుంచి కూడా స్మిత్, వార్నర్‌లను తొలగిస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా బుధవారం ప్రకటించారు.

మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ నుంచి కూడా వార్నర్ వైదొలగడంతో అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే విషయం ఇప్పుడు సగటు అభిమాని మదిలో మెదులుతోంది. ఇక గత రెండు సీజన్ల నుంచి డేవిడ్‌ వార్నర్‌ సన్‌రైజర్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

వార్నర్‌ కెప్టెన్సీలోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు 2016లో ఐపీఎల్‌ విజేతగా నిలిచింది. దీనిపై ఐపీఎల్ 11వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున ప్రాతినిథ్యం వహిస్తోన్న వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా స్పందించాడు. వార్నర్ తమ జట్టులో లేకపోయినా అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు ఉన్నారని అన్నాడు.

'టీం కెప్టెన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కెప్టెన్‌గా వార్నర్ తప్పుకోవడం తొలుత కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. కానీ అది టీంపై ఎక్కువగా ప్రభావం చూపదు. వార్నర్‌ ఉంటే అది మాకు అదనపు బలం. అతనో అద్భుత ఆటగాడు. గత సీజన్లలో హైదరాబాద్‌ సారథిగా మంచి ప్రదర్శన కనబర్చాడు. అయినాసరే అతని స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు' అని సాహా అన్నాడు.

'జట్టు మిడిలార్డర్‌లో విలియమ్సన్, దీపక్ హుడా, మనీష్ పాండే వంటి ఆటగాళ్లతో చాలా బలంగా ఉంది. ఓపెనర్లు చక్కటి ఆరంభాన్నిస్తే మిడిలార్డర్ ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. వార్నర్ మా జట్టులో ఉంటే అది మాకు బలమే. మా జట్టు రిజర్వ్‌ బెంచ్‌ చాలా బలంగా ఉంది' అని సాహా పేర్కొన్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ తప్పుకోవడంతో కెప్టెన్ పదవి ఎవరికి ఇస్తారని చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా తయారైంది. రేసులో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కెప్టెన్ ఎవరనేది జట్టు యాజమాన్యం త్వరలో ఓ ప్రకటనలో తెలియజేయనుంది.

Story first published: Wednesday, March 28, 2018, 18:38 [IST]
Other articles published on Mar 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+