Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ జోరు తగ్గలేదు: ఢిల్లీతో మ్యాచ్‌కు భువీ సిద్ధం

IPL 2018: Sunrisers have performed well even without Bhuvi: Irfan Pathan

హైదరాబాద్: సన్‌రైజర్స్ ప్రధాన పేసర్ భువనేశ్వర్‌ లేకున్నా ఆ జట్టు బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారని టీమిండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ 'ప్రధాన బౌలర్‌ భువీ లేకున్నా సన్‌రైజర్స్‌ బౌలింగ్‌లో రాణిస్తోంది. నా దృష్టిలో వన్డే క్రికెట్లో బుమ్రా జతకట్టేది భువీతోనే. గత రెండు, మూడు మ్యాచ్‌ల్లో భువీ లేకున్నా సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ అద్భుతంగా ఉంది' అని అన్నాడు.

వెన్నెముక గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరం

వెన్నెముక గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరం

వెన్నెముక గాయం కారణంగా ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లకు భువనేశ్వర్‌ దూరమైన సంగతి తెలిసిందే. భువీ లేకున్నా సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు స్వల్ప లక్ష్యాలను అద్భుతంగా కాపాడుకుంటోంది. 'సిద్ధార్థ్‌ కౌల్‌, సందీప్‌ శర్మ ఉన్నప్పటికీ జట్టులో మంచి అంతర్జాతీయ పేసర్‌ లేడు. అయినా కూడా వాళ్లు గొప్పగా బౌలింగ్‌ చేస్తున్నారు. రషీద్‌ ఖాన్‌, షకీబ్‌ అల్‌ హసన్‌ విదేశీ ఆటగాళ్లే కానీ స్పిన్నర్లు' అని పఠాన్ అన్నాడు.

మయాంక్‌ మార్కండేపై పఠాన్ ప్రశంసల వర్షం

మయాంక్‌ మార్కండేపై పఠాన్ ప్రశంసల వర్షం

ఇక, ఐపీఎల్ 11వ సీజన్‌తో వెలుగులోకి వచ్చిన ముంబై స్పిన్నర్ మయాంక్‌ మార్కండేపై పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'లెగ్‌ స్పిన్నర్‌ సరైన ప్రదేశాల్లో బంతులేయడం ముఖ్యం. మయాంక్‌ నిలకడగా అదే పని చేస్తున్నాడు. లెగ్‌ స్పిన్నర్‌ బౌలింగ్‌లో వైవిధ్యాన్ని చూపించాలి. కానీ బంతిపై నియంత్రణ సాధించి సరైన దారిలో దాని గమనాన్ని నిర్దేశించడం అంటే మామూలు విషయం కాదు' అని అన్నాడు.

 ఢిల్లీతో జరగబోయే మ్యాచ్‌కు భువీ అందుబాటులో

ఢిల్లీతో జరగబోయే మ్యాచ్‌కు భువీ అందుబాటులో

ఇదిలా ఉంటే గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన సన్‌రైజర్స్ ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ తెలిపాడు. గురువారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విలియమ్సన్, భువీ గాయంపై మాట్లాడాడు.

విశ్రాంతి అవసరమని భావించాం

విశ్రాంతి అవసరమని భావించాం

'ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో మ్యాచ్‌కు మరో రెండు రోజుల సమయం ఉంది. భువీ రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే అదేమంతా తీవ్రమైన గాయం కాదని అనుకుంటున్నా, కానీ అతనికి విశ్రాంతి అవసరమని భావించాం. వచ్చే మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడు' అని విలియమ్సన్ తెలిపాడు.

Story first published: Friday, May 4, 2018, 10:19 [IST]
Other articles published on May 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+