Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: 'ధోనితో కలిసి మళ్లీ మ్యాజిక్ చేస్తాం'

 IPL 2018: Stephen Fleming Looks to Rekindle Magic in CSK

హైదరాబాద్: మహేంద్ర సింగ్‌ ధోని, చైన్నై సూపర్‌ కింగ్స్‌ తన కెరీర్‌లో ఎంతో కీలకమని ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్‌ వ్యాఖ్యానించాడు. రెండేళ్ల నిషేధం తర్వాత పునరాగమనం చేస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్‌ను తిరిగి విజయాల బాట పట్టించడమే తన లక్ష్యమని ఫ్లెమింగ్‌ అన్నాడు.

మొదటి ఎనిమిది సీజన్లలో సాధించిన విజయాల పరంపరను తిరిగి కొనసాగించే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్లెమింగ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'తొలి సీజన్‌లో ఓ హోటల్‌లో ప్రారంభమైన మా స్నేహం.. అనంతరం ఓ విజయవంతమైన జట్టుగా కొనసాగడం.. ఈ 10 ఏళ్ల వ్యవధిలో ఎంతో చరిత్ర ఉన్నట్లు' పేర్కొన్నాడు.

మొదటి ఎనిమిది సీజన్లలో సాధించిన విజయాలనే స్ఫూర్తిగా తీసుకొని తిరిగి వాటిని ఈ సీజన్‌లో కొనసాగించడమే తమ లక్ష్యమని ప్లెమింగ్ అన్నాడు. ధోని రూపంలో జట్టులో గొప్ప అనుభవజ్ఞుడైన ఆటగాడు ఉన్నాడని, యువ ఆటగాళ్లతో చెన్నై సూపర్ కింగ్స్ సమతూకంగా ఉందని పేర్కొన్నాడు.

'జట్టు నిండా మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, ఆల్ రౌండర్లే తమ జట్టు బలం. వీరికితోడు విలువైన స్పిన్నర్లు, పేస్‌ బౌలర్లు, బలమైన బ్యాటింగ్‌ లైనప్‌తో చెన్నై సమతూకంగా రాణిస్తుంది' అని ఫ్లెమింగ్‌ తెలిపాడు. ఏప్రిల్‌ 7న తొలి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుతో చెన్నై తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నమెంట్‌ను ఘనంగా ఆరంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు కోచ్ ప్లెమింగ్ తెలిపాడు.

Story first published: Thursday, March 29, 2018, 11:44 [IST]
Other articles published on Mar 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+