For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒంటి చేత్తో విరాట్ షాట్‌ను ఒడిసిపట్టిన యూసఫ్ పఠాన్ (వీడియో)

IPL 2018, SRH vs RCB: Twitter erupts as Yusuf Pathan takes stunning one-handed catch to dismiss Virat Kohli

హైదరాబాద్: కోహ్లి, డివిలియర్స్‌ లాంటి ఆటగాళ్లున్న జట్టు ముందు 147 పరుగుల లక్ష్యం ఏమంత పెద్దగా అనిపించదు. ఐతే భీకరమైన బౌలింగ్‌తో సత్తా చాటుతున్న సన్‌రైజర్స్‌కు మ్యాచ్‌ కాపాడుకోడానికి ఆ స్కోరు సరిపోయింది. ఆ జట్టు బౌలర్లు అద్భుతమైన బంతులతో విజృంభిస్తుంటే హేమాహేమీ బ్యాట్స్‌మెన్‌ తోకముడిచారు. నిజానికి మొదట్లో పరిస్థితి బెంగళూరుకు అనుకూలంగానే కనిపించింది.

కెప్టెన్‌ కోహ్లి నిలకడగా ఆడటంతో:

కెప్టెన్‌ కోహ్లి నిలకడగా ఆడటంతో:

ఓపెనర్లు పార్థివ్‌ పటేల్‌ (20), మనన్‌ వోహ్రా (8) ఎంతోసేపు క్రీజులో నిలవకపోయినా.. కెప్టెన్‌ కోహ్లి నిలకడగా ఆడటంతో బెంగళూరు లక్ష్యం వైపు సాగింది. షకిబ్‌ బౌలింగ్‌లో ఒక సిక్సర్‌, రెండు ఫోర్లతో చెలరేగాడు. విరాట్‌. మరో ఎండ్‌లో డివిలియర్స్‌ (5) ఉండటంతో బెంగళూరుదే మ్యాచ్‌ అనిపించింది. ఐతే కోహ్లి ఔటవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

సన్‌రైజర్స్ మ్యాచ్ చేజారేలా కనిపించి:

కోహ్లి ధాటిగా ఆడుతుండటంతో మ్యాచ్ సన్‌రైజర్స్ చేజారేలా కనిపించింది. గెలవాలంటే కోహ్లిని పెవిలియన్ చేర్చడమే మార్గం అనుకుంటున్న తరుణంలో.. షకీబ్ బౌలింగ్‌లో యూసుఫ్ పఠాన్ అద్భుత క్యాచ్‌తో విరాట్‌ను ఔట్ చేశాడు.

పదో ఓవర్లో విరాట్ బంతిని కట్ చేయబోయి:

పదో ఓవర్లో విరాట్ బంతిని కట్ చేయబోయి:

షకీబ్ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో విరాట్ బంతిని కట్ చేయబోయాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బంతి గాల్లోకి లేచింది. థర్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్న పఠాన్ వెనక్కి వెళ్తూ.. ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. కోహ్లి ఔటవడంతో సన్‌రైజర్స్ సంబరాల్లో మునిగిపోయింది. తర్వాత మన్‌దీప్-గ్రాండ్‌హోమ్ పోరాడినా.. సన్‌రైజర్స్‌దే పైచేయిగా నిలిచింది.

బెంగళూరు విజయానికి 12 పరుగులు:

బెంగళూరు విజయానికి 12 పరుగులు:

ఆఖరి ఓవర్లో బెంగళూరు విజయానికి 12 పరుగులు సాధిస్తే సరిపోయే వేళ.. భువీ అద్భుత బౌలింగ్‌తో జట్టును గెలిపించాడు. 147 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు ఆరంభంలో విజయం దిశగా సాగింది. 7 ఓవర్లలో 70/2తో గెలిచేలా కనిపించింది. అయినా చివరికి 5 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.

Story first published: Tuesday, May 8, 2018, 11:37 [IST]
Other articles published on May 8, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+