
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. సొంతగడ్డపై సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 147 పరుగుల లక్ష్య చేధనలో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేశారు.
147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఆదిలోనే దెబ్బ తగిలింది. షకీబ్ ఉల్ హసన్ వేసిన మూడో ఓవర్‌లో పార్థీవ్ పటేల్ ఔటయ్యాడు. ఆ తర్వాత సందీప్ శర్మ వేసిన 8వ ఓవర్‌లో వోహ్రా (8) బౌల్డయ్యాడు. ఇక షకీబ్ ఉల్ హసన్ వేసిన 10వ ఓవర్‌లో కోహ్లీ(39) పఠాన్ క్యాచ్ అందుకోవడంతో కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు.
ఆ తర్వాత ఓవర్‌లోనే ఏబీ డివిలియర్స్(5)ను రషీద్ ఖాన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 12వ ఓవర్‌లో మొయిన్ అలీ(10)ని కౌల్ ఔట్ చేశాడు. ఆ తరవాత మన్‌దీప్ సింగ్ (21), డిగ్రాండ్‌హోమ్ (33) పోరాడినా ఫలితం లేకపోయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో షకీబ్ ఉల్ హాసన్ 2 వికెట్లు తీసుకోగా... సందీప్ శర్మ, భువీ, రషీద్ ఖాన్, సిద్దార్ద్ కౌల్ తలో వికెట్ తీసుకున్నారు.
15 ఓవర్లకు బెంగళూరు 102/5
ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. 15 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు 2 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మన్‌దీప్ సింగ్ (10, కొలిన్ డి గ్రాండ్ హోమ్ (8) పోరాడుతున్నారు. బెంగళూరు జట్టు గెలవాలంటే 30 బంతుల్లో 45 పరుగులు చేయాల్సి ఉంది.
12 ఓవర్లకు బెంగళూరు 85/5
ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. 11వ ఓవర్ నాలుగో బంతికి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో డివిలియర్స్(5) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరగా, ఆ తర్వాత ఇన్నింగ్స్ 12వ ఓవర్ నాలుగో బంతికి సిద్దార్థ్ కౌల్ బౌలింగ్‌లో మెయిన్ అలీ (10) వికెట్ కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 13 ఓవర్లకు గాను బెంగళూరు 5 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. అంతకముందు కోహ్లీ(39) పరుగుల వద్ద షకీబ్ ఉల్ హాసన్ బౌలింగ్‌లో యూసఫ్ పఠాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
కోహ్లీ ఔట్: మూడో వికెట్ కోల్పోయిన బెంగళూరు
సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్య ఛేదనలో 10 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (39), మనన్ వోహ్రా (8) పరుగుల వద్ద ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో ఏబీ డివిలియర్స్ (5), మొయిన్ అలీ (1) పరుగులతో ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న కోహ్లీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడుతున్నారు. 7 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ(31), మనన్ వోహ్రా (8) క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన బెంగళూరు
ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లు సత్తా చాటుతున్నారు. 147పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు బ్యాట్స్‌మెన్ పరుగులు చేయకుండా కట్టడి చేస్తున్నారు. ఈ క్రమంలో షకిబ్ అల్ హసన్ వేసిన మూడో ఓవర్ చివరి బంతికి పార్ధివ్ పటేల్ (20) ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో 4 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. క్రీజులో మనన్ వోహ్రా(4), కోహ్లీ(7) పరుగులతో ఉన్నారు.
బెంగళూరు విజయ లక్ష్యం 147
ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది. దీంతో బెంగళూరుకు 147 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
కేన్ విలియమ్సన్ (39 బంతుల్లో 56) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్లు హేల్స్ (5), శిఖర్ ధావన్ (13), మనీష్ పాండే(5) విఫలమైనా షకీబ్ ఉల్ హసన్ (35)తో కలసి విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే వేగంగా ఆడే క్రమంలో విలియమ్సన్, షకీబుల్ హసన్ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు.
ఆ తర్వాత యూసఫ్ పఠాన్ (12), సాహా (8) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. సిరాజ్ వేసిన 19వ ఓవర్‌లో వీరిద్దరూ క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఆఖరి ఓవర్‌లో రషిద్ ఖాన్(1), సిద్ధార్థ్ కౌల్(1) రనౌట్లుగా వెనుదిరిగారు. టిమ్ సౌథీ వేసిన ఆఖరి బంతికి సందీప్ శర్మ(0) ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు.
బెంగళూరు బౌలర్లలో టిమ్ సౌథీ, సిరాజ్ చెరో మూడు వికెట్లు తీసుకోగా.. ఉమేష్ యాదవ్, చాహల్‌కు చెరో వికెట్ లభించింది.
నాలుగో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్
ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ ఆఖరి బంతికి హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (56) పరుగుల వద్ద మనదీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో యూసఫ్ పఠాన్(2), షకీబ్ ఉల్ హాసన్(35) పరుగులు చేశాడు.
15 ఓవర్లకు హైదరాబాద్ 105/3
ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో షకీబ్ ఉల్ హాసన్ (24), కేన్ విలియమ్సన్(51) పరుగులతో ఉన్నారు.
11 ఓవర్లకు సన్‌రైజర్స్ 68/3
ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో వికెట్ కోల్పోయింది. చాహల్ వేసిన 9వ ఓవర్‌లో మనీష్ పాండే(5).. కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో షకీబ్ ఉల్ హాసన్(12), కేన్ విలియమ్సన్(29) పరుగులతో ఉన్నారు.
ధావన్ ఔట్: రెండు వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్
ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది. తొలుత టిమ్ సౌథీ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి హేల్స్(5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం సిరాజ్ వేసిన ఆరో ఓవర్‌లో ధవన్(13) సౌథీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజ్‌లో విలియమ్‌సన్(21), మనీశ్(5) ఉన్నారు.
5 ఓవర్లకు హైదరాబాద్ 36/1
ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్ (12), కెప్టెన్ విలియమ్సన్ (16) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్
ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను శిఖర్ ధావన్, అలెక్స్ హేల్స్ ప్రారంభించారు. గత మ్యాచ్‌లో రాణించిన అలెక్స్ హేల్ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి టిమ్ సౌథీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. 3 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు
ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది.
దీంతో కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు తలపడటం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, బెంగళూరు రెండు మార్పులు చేసింది.
బ్రెండన్ మెకల్లమ్, మురుగన్ అశ్విన్‌ల స్థానాల్లో మొయిన్ అలీ, మనన్ వోహ్రాలను తుది జట్టులోకి తీసుకంది. ఈ సీజన్‌లో మొయిన్ అలీకి తొలి తొలి మ్యాచ్ కావడం విశేషం. కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాలతో మంచి ఊపు మీద ఉండగా, రాయల్ చాలెంజర్స్ మాత్రం వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతోంది.
ఇప్పటివరకూ సన్‌రైజర్స్ 9 మ్యాచ్‌లకు గాను 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉండగా, ఆర్సీబీ 9 మ్యాచ్‌ల్లో మూడింట మాత్రమే విజయం సాధించి ఆరో స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో గనుక విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ బెర్తుని కన్ఫమ్ చేసుకుంటుంది.
మరోవైపు ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే రాయల్ ఛాలెంజర్స్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ సీజన్‌లో మిగిలిన నాలుగు గేమ్‌ల్లో గెలిస్తేనే రాయల్ ఛాలెంజర్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో ఉన్న ఆర్‌సీబీ ఈ నాలుగింటిలో ఏ ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవాల్సిందే.
ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన చేసి ఈ సీజన్‌లో ఏడో విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక, చెన్నైతో గత మ్యాచ్‌లో తలపడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిని మూటగట్టుకుంది.
జట్ల వివరాలు:
సన్‌రైజర్స్ హైదరాబాద్:
కేన్ విలియమ్సన్(కెప్టెన్), షకీబ్ ఉల్ హసన్, యూసఫ్ పఠాన్, శిఖర్ ధావన్, వృద్ధిమాన్ సాహా, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, మనీష్ పాండే, అలెక్స్ హేల్స్, సందీప్ శర్మ, రషీద్ ఖాన్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), మొయిన్ అలీ, ఏబీ డివిలియర్స్, పార్థీవ్ పటేల్, టిమ్ సౌతీ, ఉమేశ్ యాదవ్, మన్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్, గ్రాండ్ హోమ్, మనన్ వోహ్రా, మహమ్మద్ సిరాజ్