For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రసవత్తరంగా ప్లే ఆఫ్ రేసు: ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌తో కోల్‌కతా

By Nageshwara Rao
IPL 2018: SRH vs KKR: Preview: Playing 11s, Timings, Live Streaming & More

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ మలి దశకు వచ్చినప్పటికీ ప్లేఆఫ్ బెర్తులపై ఇంకా స్పష్టత రాలేదు. మ్యాచ్ మ్యాచ్‌కు ఉత్కంఠరేపుతూ జట్లు అనూహ్య విజయాలు సాధించడంతో ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్(18), చెన్నై సూపర్ కింగ్స్(16) ప్లేఆఫ్ బెర్తులను ఖరారు చేసుకోగా, మిగిలిన రెండు బెర్తుల కోసం ఐదు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం నగరంలోని ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్‌ జట్టుతో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. ప్లేఆఫ్ బెర్తు దక్కించుకోవాలంటే కోల్‌కతా ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలువాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక వేళ మ్యాచ్ ఓడిపోతే మిగతా జట్ల గెలుపు, ఓటములపై కోల్‌కతా భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో

ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన 13 మ్యాచ్‌ల్లో 18 పాయింట్లతో పాయింట్ల పట్టకిలో అగ్రస్థానంలో కొనసాగుతుంటే.. కోల్‌కతా 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. కాగా, సన్‌రైజర్స్ వరుసగా రెండు ఓటములతో ఒకింత ఒత్తిడిలో ఉండగా, రాజస్థాన్‌పై విజయం సాధించి కోల్‌కతా ప్లేఆఫ్ అవకాశాలను మెరుగుపర్చుకుంది.

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కోల్‌కతా గెలవాల్సిందే

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కోల్‌కతా గెలవాల్సిందే

పాయింట్ల పరంగా కోల్‌కతా మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ మ్యాచ్‌లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి. బౌలింగ్‌తో ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా నిలుస్తూ వరుస విజయాలతో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్, గత రెండు మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేకపోయింది. చెన్నై, బెంగళూరు జట్లతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఓడిపోయింది.

బసిల్ థంపీ చెత్త రికార్డు

బసిల్ థంపీ చెత్త రికార్డు

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్ బసిల్ థంపీ రికార్డు స్థాయిలో నాలుగో ఓవర్లలో 70 పరుగులిచ్చుకుని ఐపీఎల్‌లో అత్యంత చెత్తరికార్డును నమోదు చేశాడు. దీంతో శనివారం కోల్‌కతాతో జరగనున్న మ్యాచ్‌లో థంపీని తప్పించే అవకాశముంది. ఇక, బ్యాటింగ్‌లో కెప్టెన్ విలియమ్సన్ జోరు కొనసాగుతుండగా, బెంగళూరు మ్యాచ్‌లో పాండే ఫామ్‌లోకి వచ్చాడు.

ఫామ్‌లోకి కుల్దీప్ యాదవ్

ఫామ్‌లోకి కుల్దీప్ యాదవ్

మరోవైపు కోల్‌కతా బ్యాటింగ్‌లో క్రిస్ లిన్, సునీల్ నరైన్, కెప్టెన్ దినేశ్ కార్తీక్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఇక, బౌలర్ల విషయానికి వస్తే శివమ్‌ మావి, ప్రసిద్ధ్ కృష్ణ, రస్సెల్ అంతగా ప్రభావమేమి చూపకపోతుండగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో ఫామ్‌లోకి వచ్చాడు.

 జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

సన్‌రైజర్స్ హైదరాబాద్:

Kane Williamson (C), Shikhar Dhawan, Manish Pandey, Bhuvneshwar Kumar, Wriddhiman Saha, Siddharth Kaul, Deepak Hooda, Khaleel Ahmed, Sandeep Sharma, Yusuf Pathan, Shreevats Goswami, Ricky Bhui, Basil Thampi, T Natarajan, Sachin Baby, Bipul Sharma, Mehdi Hasan, Tanmay Agarwal, Alex Hales, Carlos Brathwaite, Rashid Khan, Shakib Al Hasan, Mohammad Nabi and Chris Jordan.

కోల్‌కతా నైట్ రైడర్స్:

Dinesh Karthik (C), Sunil Narine, Andre Russell, Chris Lynn, Robin Uthappa, Kuldeep Yadav, Piyush Chawla, Nitish Rana, Prasidh Krishna, Shivam Mavi, Mitchell Johnson, Shubman Gill, R. Vinay Kumar, Rinku Singh, Cameron Delport, Javon Searless, Apoorv Wankhade, Ishank Jaggi, Tom Curran.

మ్యాచ్ ప్రారంభం రాత్రి 8 గంటలకు

Story first published: Saturday, May 19, 2018, 12:38 [IST]
Other articles published on May 19, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+