Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: లెవన్ వన్ తప్పిదం చేసిన సిద్దార్ధ్ కౌల్, రిఫరీ వార్నింగ్

IPL 2018: SRH pacer Kaul reprimanded for Level 1 offence

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.4 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది.

 87 పరుగులకే ఆలౌటైన ముంబై

87 పరుగులకే ఆలౌటైన ముంబై

అనంతరం 119 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 87 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ పటిష్టమైన బౌలింగ్ లైనప్ కలిగిన జట్టు అని మరోసారి రుజువు అయింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు బౌలర్ సిద్దార్ధ్ కౌల్‌కు రిఫరీ వార్నింగ్ స్ట్రాంగ్ ఇచ్చాడు.

మార్కండేను ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చిన కౌల్

మార్కండేను ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చిన కౌల్

ఇన్నింగ్స్ 16వ ఓవర్‌ వేసిన సిద్ధార్త్‌ కౌల్‌ ఓవర్‌ చివరి బంతికి ముంబై ఆటగాడు మయాంక్‌ మార్కండేను ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. ఈ క్రమంలో వికెట్ తీసిన ఆనందంలో బౌలర్‌ కౌల్‌.. ఔటైన క్రికెటర్‌ మయాంక్‌ మార్కండేను వెక్కిరించాడు. ఈ విషయాన్ని ముంబై ఆటగాళ్లు రిఫరీ దృష్టికి తీసుకెళ్లారు.

లెవల్ వన్‌ తప్పిదం చేసిన సిద్ధార్ధ్ కౌల్

లెవల్ వన్‌ తప్పిదం చేసిన సిద్ధార్ధ్ కౌల్

దీంతో ఐపీఎల్‌ ఆటగాళ్ల ప్రవర్తనా నియమాళి 2.1.4 ప్రకారం బౌలర్‌ సిద్దార్ధ్ కౌల్ లెవల్ వన్‌ ప్రకారం తప్పు చేసినట్లు రిఫరీ గుర్తించాడు. అయితే జరిమానా ఎంత అన్నది ఇంకా వెల్లడించలేదు. పూర్తి స్థాయిలో దీనిపై విచారణ జరిపిన అనంతరం అతడి గేమ్‌ పాయింట్లలో కోత విధించే అవకాశాలు ఉన్నాయి.

 9 వికెట్లు తీసిన కౌల్‌

9 వికెట్లు తీసిన కౌల్‌

ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ జట్టుకు సిద్దార్ధ్ కౌల్ ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటివరకు 9 వికెట్లు తీసిన కౌల్‌ సన్‌రైజర్స్‌ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్‌ని గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆడనుంది.

Story first published: Wednesday, April 25, 2018, 17:16 [IST]
Other articles published on Apr 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+