న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధావన్ కొడుకుతో కలిసి సూపర్ హీరో మోడ్ ఆన్ చేశాడట

IPL 2018: Shikhar Dhawan, Son Zoravar Turn On Hulk Mode

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో ప్లేఆఫ్ రేసులోకి దూసుకెళ్లిన తొలి జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. అలాంటిది గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. జట్టులో కీలకంగా వ్యవహరిస్తూ ముందుకు నడిపిస్తోన్న కేన్ విలియమ్‌సన్‌ను మినహాయిస్తే శిఖర్ ధావన్ హైదరాబాద్ జట్టుకు ఆధారంగా మారాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్‌కు ముందు తన కొడుకు జరోవర్ తో కలిసి ఆడుకుంటున్న వీడియోలను తన అధికారికి ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేశాడు ధావన్.

ధావన్ అతని కొడుకు కలిసి హల్క్ మాస్క్‌తో ఆడుకుంటూ ఉన్న వీడియో అది. పైగా ఆ ట్వీట్‌లో సరదాగా ఎయిర్ ప్లేడ్ మోడ్ ఆఫ్, హల్క్ మోడ్ ఆన్ అంటూ సూపర్ హీరోస్ పేర్లను హ్యాష్ ట్యాగ్ లుగా పెట్టి ట్వీట్ చేశాడు. ఈ లీగ్ లో ఇప్పటి వరకూ ధావన్ 11మ్యాచ్‌లు ఆడాడు. 46.12యావరేజితో 369పరుగులు చేశాడు. హైదరాబాద్ జట్టు కెప్టెన్ విలియమ్‌సన్ కంటే తక్కువే. విలియమ్‌సన్ 12 మ్యాచ్‌లు ఆడి 544పరుగులు చేశాడు. అయినా అతని యావరేజ్ 60.44గా ఉంది.

లీగ్ మొత్తానికి విలియమ్‌సన్ కంటే రిషబ్ పంత్ (582) ఎక్కువ పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ధావన్ అతని సహచరులతో సరదాగా గడపడం చాలా ఇష్టపడతాడు. అంతకుముందు ఓసారి విమానంలో వెళ్తున్న తన సహచరులను పేపర్‌తో సరదాగా ఆటపట్టించాడు కూడా.

😂😂

A post shared by Team India🇮🇳 (@indiancricketteam7) on

102వన్డేల్లో ఆడిన ధావన్ 45.9 యావరేజ్‌తో 4361పరుగులు సాధించాడు. ఇందులోనే 13సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Story first published: Monday, May 14, 2018, 17:42 [IST]
Other articles published on May 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X