For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాక్టింగ్ చేయడం మానేసి క్రికెట్ ఆడుకోండి: షారూక్

IPL 2018: Shah Rukh Khan trolls KKR players as they try their hand at acting, asks them to stick to cricket

హైదరాబాద్: ఎత్తుపల్లాలను చూస్తూ లీగ్‌లో గెలుపోటములు ఎదుర్కొంటూ ప్లేఆఫ్ ఆశలు సజీవం చేసుకుంది కోల్‌కతా నైట్ రైడర్స్. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌‌ గెలుపొంది ప్లేఆఫ్‌ దిశగా అడుగులు వేసింది. అయితే ఆటతోనే కాకుండా.. తమ నటనా ప్రతిభతో కూడా తమ జట్టు సహ యజమాని షారుక్‌ను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కేకేఆర్‌ ఆటగాళ్లు.

 షారుక్‌లా డైలాగులు చెప్పేందుకు

షారుక్‌లా డైలాగులు చెప్పేందుకు

ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో కోల్‌కతా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. కింగ్‌ఖాన్‌ నటించిన సినిమాల్లోని ఫేమస్‌ డైలాగులు చెప్పడంలో ఆటగాళ్ల కాస్త తడబడ్డారు. కోల్‌కతా జట్టు కెప్టెన్ దినేశ్‌ కార్తీక్‌, క్రిస్‌లిన్‌, సునీల్‌ నరైన్‌, రాబిన్‌ ఉతప్ప, పీయూష్‌ చావ్లా, కుల్‌దీప్‌ యాదవ్‌, శివమ్‌ మావి, శుభ్‌మన్‌గిల్‌ షారుక్‌లా నటించేందుకు, డైలాగులు చెప్పేందుకు ప్రయత్నించారు.

బ్యాటరీ నహీ బోల్నే కా

ఆస్ట్రేలియా ఆటగాడైన క్రిస్‌ లిన్‌ రాయీస్ సినిమాలోని ‘బ్యాటరీ నహీ బోల్నే కా' డైలాగ్‌ చెప్పాడు. చెన్నై ఎక్స్‌ప్రెస్‌, మైహూనా, దిల్‌వాలే చిత్రాల్లో ప్రేక్షకాదరణ పొందిన డైలాగులు చెబుతూ ఆటగాళ్లు సందడి చేశారు. ఈ వీడియో చూసిన షారుక్‌ ట్విటర్ ద్వారా స్పందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను షారుఖ్‌ సొంత నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్టైన్‌మెంట్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

 కోల్‌కతా ఆటగాళ్ల ముందుకు డీల్‌

కోల్‌కతా ఆటగాళ్ల ముందుకు డీల్‌

వాళ్లు ఇంతవరకు మైదానంలో చేసిన ప్రదర్శనే మీరు చూసి ఉంటారు.. ఇప్పుడు వారి రాకింగ్‌ పెర్ఫామెన్స్‌ చూడండి అంటూ సదరు సంస్థ ట్వీట్‌ చేసింది. అయితే షారూక్‌ను అనుకరించేందుకు ఆటగాళ్లు చేసిన ప్రయత్నం నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియోను వీక్షించిన షారూక్ ఇలా స్పందించారు. ‘నా జట్టుపై ఉన్న ప్రేమతో చెప్తున్నా. అంటూ డీల్‌ను కోల్‌కతా ఆటగాళ్ల ముందుంచాడు.

మీ పని మీరు చూసుకోండంటూ

'జట్టుపై ఉన్న ప్రేమ, నమ్మకంతో చెప్తున్నా. నేను క్రికెట్ మీకు అప్పజెప్పేస్తాను. నాకు యాక్టింగ్ వదిలేయండి.' అని పరోక్షంగా మీ పని మీరు చూసుకోండంటూ బదులిచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇంకా ఒక మ్యాచ్‌ మాత్రమే ఆడాల్సి ఉంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా గెలిస్తేనే ప్లేఆఫ్‌ చేరుకుంటుంది. రెండు ప్లేఆఫ్‌ బెర్తుల కోసం ఇప్పటికీ ఐదు జట్లు రేసులో ఉండటం విశేషం.

Story first published: Thursday, May 17, 2018, 14:28 [IST]
Other articles published on May 17, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+