Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్ జట్టులో నుంచి వెళ్ళిపోవడం టీం ఫిలాసఫీ: షారూఖ్ ఖాన్

IPL 2018: Shah Rukh Khan speaks on Gautam Gambhir's KKR exit, team's philosophy

హైదరాబాద్: 2018 ఐపీఎల్‌కు గౌతం గంభీర్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడట్లేదు. ఈ విషయంపై షారూఖ్ ఖాన్ తాజాగా స్పందించాడు.
బాలీవుడ్ సూపర్ స్టార్ నైట్ రైడర్స్ జట్టు సహ యజమాని అయినటువంటి షారూఖ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా రెండు విషయాలు వెల్లడించాడు.

మొదటిది 'విల్ మిస్ హిమ్' అంటూ బాధను వ్యక్తం చేస్తుంది. మరొకటి జట్టు ఏం కోరుకుంటుందంటే కొత్త వాళ్లకు జట్టులోకి అవకాశమివ్వాలనే ప్రయత్నంలోనే ఇలా జరిగిందంటూ అభిప్రాయపడ్డాడు. వేలం అనంతరం జట్టు రూ. 59 కోట్లు వెచ్చించి ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

గంభీర్ ఏడు సంవత్సరాల నుంచి అదే జట్టులో కొనసాగుతున్నాడు. జట్టు రిటెన్షన్ జాబితాలో పేరు ఉండకపోవడంపై అలిగిన గంభీర్ జట్టులో ఆడేది లేదంటూ నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత వేలంలోనూ, రైట్ టు మ్యాచ్ కార్డ్ ద్వారా జట్టు కొనుగోలు చేస్తానని చెప్పినా ఏ మాత్రం ఆసక్తి చూపని గంభీర్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ప్రారంభ ధర అయిన రూ.2 కోట్లకే కొనుగోలు చేసింది. వేలం తర్వాత నైట్ రైడర్స్ జట్టు సీఈవో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఐపీఎల్ వేలం అనంతరం నైట్ రైడర్స్ పూర్తి జట్టు:
కోల్‌కతా నైట్ రైడర్స్
1. సునీల్ నరైన్ (రూ.8.5 కోట్లు - Retained)
2. అండ్రీ రసెల్ (రూ.7 కోట్లు-Retained)
3. మిచెల్ స్టార్క్ (9.4 కోట్లు)
4. క్రిస్ లిన్ (9.6 కోట్లు)
5. దినేష్ కార్తీక్ (రూ.7.4 కోట్లు)
6. రాబిన్ ఉతప్ప (రూ.6.4 కోట్లు-RTM)
7. పియూష్ చావ్లా (రూ.4.2 కోట్లు-RTM)
8. కుల్‌దీప్ యాదవ్ (రూ.5.8 కోట్లు -RTM)
9. శుభ్‌మాన్ గిల్ (రూ.1.8 కోట్లు)
10. ఇషాంక్ జగ్గి (రూ.20 లక్షలు)
11. నితీష్ రాణా (రూ.3.4 కోట్లు)
12. కమలేష్ నగర్‌కోటి (రూ.3.2 కోట్లు)
13. వినయ్ కుమార్ (రూ.కోటి)
14. అపూర్వ్ వాంఖెడె (రూ.20 లక్షలు)
15. రింకు సింగ్ (రూ.80 లక్షలు)
16.శివమ్ మావి (రూ.3 కోట్లు)
17. కేమరూన్ డెల్‌పోర్ట్ (రూ.30 లక్షలు)
18. మిచెల్ జాన్స‌న్ (రూ.2 కోట్లు)
19. జేవ‌న్ సియ‌ర్‌లెస్ (రూ.30 ల‌క్ష‌లు)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, February 4, 2018, 12:25 [IST]
Other articles published on Feb 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+