Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

త్వరలోనే గ్రౌండ్‌లో కలుద్దాం: గాయంపై ధావన్ వీడియో ట్వీట్

IPL 2018: See you at the ground soon, SRHs Shikhar Dhawan provides video update on his injury

హైదరాబాద్: 'త్వరలోనే మైదానంలోకి తిరిగి వస్తా' అని గాయం నుంచి కోలుకుంటున్న శిఖర్ ధావన్ అన్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ గాయపడిన సంగతి తెలిసిందే.

గత వారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ బౌలర్ బరీందర్‌ వేసిన షార్ట్‌ బాల్‌ ధావన్‌ ఎడమ చేతికి బలంగా తాకింది. దీంతో ఆ మ్యాచ్‌లో ధావన్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. అంతేకాదు ఆదివారం సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కి కూడా దూరమయ్యాడు.

దీంతో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తాజాగా ధావన్ తన ట్విట్టర్‌ ఓ వీడియోని పోస్టు చేశాడు. 'గాయం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న నా అభిమానులందరికీ ధన్యవాదాలు. గాయం నుంచి కోలుకునేందుకు చేయాల్సినవన్ని చేస్తున్నా. త్వరలోనే గ్రౌండ్‌లో కలుస్తా' అని ధావన్ పేర్కొన్నాడు.

ఈ వీడియోలో ధావన్‌ కుమారుడు జరోవర్‌ కూడా ఉన్నాడు. టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. మంగళవారం నాడు జరిగే ఈ మ్యాచ్‌కు ముంబై సొంత మైదానమైన వాంఖడె స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

Story first published: Monday, April 23, 2018, 15:31 [IST]
Other articles published on Apr 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+