తొలి మ్యాచ్‌లోనే సర్‌ప్రైజ్ ఇవ్వనున్న రోహిత్ శర్మ

Posted By:
IPL 2018: Rohit Sharma wants to keep his batting position for Mumbai Indians a surprise

హైదరాబాద్: ఐపీఎల్ పదకొండో సీజన్ ఆరంభంలో సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఏప్రిల్ 7 శనివారం చెన్నై జట్టు, ముంబై జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ గురువారం మీడియాతో జట్టు గురించి విశ్లేషిస్తూ మాట్లాడారు.

బ్యాటింగ్ ఆర్డర్ ఛేంజ్:

బ్యాటింగ్ ఆర్డర్ ఛేంజ్:

‘ఈ సీజన్‌లో అభిమానులకు తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్పుతో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాను. మా మిడిలార్డర్‌ బలంగా ఉంది. అద్భుతమైన ఓపెనర్లు (ఎల్విన్‌ లూయిస్‌ (వెస్టిండీస్‌), ఇషాన్‌ కిషాన్‌లు) ఉన్నారు. దీంతో నేను ఏడో స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకు సన్నద్ధమవుతున్నాను. ఇదే నేను అభిమానులకిచ్చే సర్‌ప్రైజ్‌. ముంబై గొప్ప ఆటగాళ్లతో కూడిన ఓ అద్భుతమైన జట్టు. బయట ఏం జరుగుతోంది మాకు అనవసరం జట్టుగా ముందుకెళ్లి లక్ష్యాన్ని సాధించడమే మా పని.

పదేళ్లుగా కొనసాగించి విజయవంతమైయ్యాం:

పదేళ్లుగా కొనసాగించి విజయవంతమైయ్యాం:

ఈ స్పూర్తినే మేం గత పదేళ్లుగా కొనసాగించి విజయవంతమయ్యాం. ఇక డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌గా మేం ఎలాంటి ఒత్తిడికి లోనవ్వడం లేదు. అది మా బాధ్యతగా భావిస్తున్నాం. అదే స్తైర్యంతో ముందుకువెళతాం. మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చే ఆటగాళ్లు.. వికెట్లు తీసే బౌలర్లు, పరుగుల వరద పారించే బ్యాట్స్‌మెన్‌ మా జట్టులో ఉన్నారు.

ఒత్తిడిని అధిగమిస్తూ.. ముందుకు:

ఒత్తిడిని అధిగమిస్తూ.. ముందుకు:

కేవలం మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమిస్తూ.. ముందుకు కొనసాగడమే మా పని. జస్ప్రీత్‌ బుమ్రా అద్భుతమైన బౌలర్‌. తమ జట్టుకు అతను అదనపు బలం. గత రెండు, మూడేళ్లుగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. గత సీజన్‌లో మలింగా ఫామ్‌లో లేకున్నా రాణించాడు 'అని రోహిత్‌ అభిప్రాయపడ్డాడు.

అన్ని జట్లతో పాటు మేం కూడా: జయవర్దనే

అన్ని జట్లతో పాటు మేం కూడా: జయవర్దనే

డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న మా జట్టు ఫేవరేట్‌ కాదని , ఇతర జట్లలాగే బరిలో దిగుతున్నామని ముంబై ఇండియన్స్‌ మెంటార్‌ మహేల జయవర్దనే తెలిపాడు. ప్రస్తతం మా జట్టు మంచి దశలో ఉందని, చెన్నైతో తొలి మ్యాచ్‌ ఆడేందుకు పూర్తిగా సిద్దమయ్యామని స్పష్టం చేశాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, April 6, 2018, 13:07 [IST]
Other articles published on Apr 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి