న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: 'కొత్త ముఖాలు' ట్వీట్‌పై రోహిత్ శర్మ, ఎమోజీలు చూశారా!

By Nageshwara Rao
IPL 2018: Rohit Sharma engages in hilarious Twitter banter with Mumbai Indian team over new faces

హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ ప్రారంభానికి ముందే కావాల్సినంత వినోదం పంచడానికి సిద్ధమైంది రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు. ఏప్రిల్‌ 7న ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 11వ సీజన్ కోసం అభిమానులకు మరితంగా దగ్గరయ్యేందుకు గాను ముంబై ఫ్రాంచైజీ ఆటగాళ్ల ప్రత్యేక ఎమోజీలను రూపొందించింది.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

అయితే ఈ విషయాన్ని ప్రాంఛైజీ ఆటగాళ్లకు అధికారికంగా చెప్పకపోవడంతో రోహిత్ శర్మ మండిపడ్డాడు. 'మన జట్టులో చేరిన కొత్త ముఖాలకు స్వాగతం పలకండి' అని పరోక్షంగా ఎమోజీల గురించి ముంబై ప్రాంఛైజీ ట్వీట్‌ చేయగా.. 'కొత్త ముఖాలు అనడంలో మీ ఉద్దేశం ఏమిటి? అయినా నాకెందుకు ముందుగా చెప్పలేదు' అంటూ రోహిత్‌ శర్మ ట్వీట్‌ చేశాడు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

అందుకు ప్రతిగా 'కెప్టెన్‌ ఈ విషయం గురించి మీరు ఒకసారి చెక్‌ చేసుకోండి' అని ప్రాంఛైజీ ట్వీట్‌ చేయగా నేను చెక్‌ చేశాను. 'ఈ కొత్త ముఖాలు చాలా కూల్‌గా ఉన్నాయి. కానీ నా బుల్లెట్స్‌ ఎక్కడ' అంటూ రోహిత్‌ ప్రశ్నించాడు.

ఆ తర్వాత 'హార్దిక్‌ పాండ్యా జుట్టుకు ఏమైంది. ఎందుకు తాను అలా మండిపోతున్నాడు' అంటూ ట్వీట్‌ చేశాడు. వెంటనే హార్దిక్‌ పాండ్యా కూడా ఈ సరదా సంభాషణలో జాయిన్‌ అయ్యాడు. 'నాలో ఎప్పుడూ భావోద్వేగాలతో కూడిన ఫైర్‌ రగులుతూనే ఉంటుంద'ని ట్వీట్‌ చేశాడు.

'మరి బుమ్రా, పొలార్డ్‌ ఇంకా మిగతా వాళ్లెక్కడా' అంటూ రోహిత్‌ శర్మ ప్రశ్నించగా 'పొలార్డ్‌ ఇప్పుడే ముంబైకి బయల్దేరాడు' అంటూ ప్రాంఛైజీ నుంచి సమాధానం వచ్చింది. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా తన ట్విట్టర్ ద్వారా ఎంట్రీ ఇచ్చి 'నేను బౌలింగ్‌ చేసేందుకు సన్నద్ధమవుతున్నా' అంటూ ట్వీట్‌ చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి ముంబైలోని వాంఖడె స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

Story first published: Friday, March 23, 2018, 15:31 [IST]
Other articles published on Mar 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X