న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో 50వ సెంచరీ పూర్తి చేసిన రిషబ్ పంత్

IPL 2018: Rishabh Pant becomes first Indian to score a century in season 11

హైదరాబాద్: పదేళ్లు దాటి పదకొండో సీజన్‌లో అడుగుపెట్టినా ఐపీఎల్‌లో క్రేజ్ ఎంతమాత్రం తగ్గట్లేదు. లీగ్ ఆరంభం నుంచి రికార్డుల మోత మోగిస్తున్న ఆటగాళ్లతో ఐపీఎల్ అంతటి ఖ్యాతిని సంపాదించింది. దూకుడుగా ఆడుతూ 20ఓవర్లకే భారీ స్కోరును నమోదుచేస్తోన్న జట్లు, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన ఐపీఎల్‌కు ప్రధాన ఆకర్షణలు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో హాఫ్ సెంచరీలకైతే కొదవలేదు గానీ, సెంచరీలు మాత్రం అరుదుగా నమోదవుతాయి.

ఇప్పటి వరకూ ఐపీఎల్‌లో మొత్తం 50 సెంచరీలు నమోదయ్యాయి. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఆటగాడు 63 బంతుల్లో 128 పరుగులు సాధించాడు. ఈ సెంచరీతోనే ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 50 సెంచరీ పూర్తి చేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలోనే అధిక పరుగులు సాధించిన భారతీయ క్రికెటర్‌గా రిషబ్‌ పంత్‌ రికార్డు సృష్టించాడు.

2008లో ఆరు సెంచరీలు:
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కలమ్‌ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 158 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇదే ఐపీఎల్‌లో మొదటి సెంచరీ. 2008లో మొత్తం 6 సెంచరీలు నమోదు అయ్యాయి.

2009లో రెండు సెంచరీలు:
కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే సెంచరీలు సాధించారు. వారిద్దరూ ఎవరంటే ఏబీ డివిలియర్స్, మనీశ్‌ పాండే.

2010లో నాలుగు సెంచరీలు:
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడిన యూసఫ్ పఠాన్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ డేవిడ్ వార్నర్, మురళీ విజయ్, మహేలా జయవర్థనె

2011లో ఆరు, 2012లో ఆరు, 2013లో ఆరు, 2014లో మూడు, 2015లో నాలుగు, 2016లో ఏడు, 2017లో ఐదు,

2016లో అధికంగా సెంచరీలు:
అత్యధికంగా ఏడు సెంచరీలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో విరాట్‌ కోహ్లీనే నాలుగు సెంచరీలు సాధించడం విశేషం.

ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటి వరకు(మే 10 నాటికి) మూడు సెంచరీలు నమోదయ్యాయి. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌... సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై సెంచరీ చేసి ఈ సీజన్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు షేన్‌ వాట్సన్‌... రాజస్థాన్‌ రాయల్స్‌పై, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఆటగాడు రిషబ్‌ పంత్‌... సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై సెంచరీలు నమోదు చేశారు.

Story first published: Friday, May 11, 2018, 17:30 [IST]
Other articles published on May 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X