
వేగంగా చేరుకుంటున్నా..:
ఒక్కప్పుడు దిగ్గజాలు సాధించిన రికార్డులనూ వీరు వేగంగా చేరుకుంటున్నారు. తాజాగా శ్రేయస్ అయ్యర్ అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగుల మైలురాయి దాటేసిన వారిలో ఆరో స్థానంలో నిలిచాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ ఈ ఘనత సాధించాడు. అతడికిది 39వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో 10 సిక్సర్లు, 3 బౌండరీలతో 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

1000 చేరువైన ఆటగాళ్ల జాబితాలో:
తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులకు చేరువైన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. అంతకు ముందు సచిన్ 31 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. రైనా 34, గౌతమ్ గంభీర్ 36, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, అజింక్య రహానె 37, సౌరవ్ గంగూలీ 38 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగుల మైలురాయికి చేరుకున్నారు.

భీకరమైన ఫామ్‌లో..:
ఐపీఎల్-2015లో అరంగేట్రం చేసిన శ్రేయాస్ చక్కని బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. ఆ సీజన్‌లో 14 మ్యాచ్‌లాడి 33.76 సగటుతో 439 పరుగులు చేశాడు. 2016లో కేవలం 6 మ్యాచ్‌ల్లో 30 పరుగులతో పేలవ ప్రదర్శన చేశాడు. అయితే 2017లో 12 మ్యాచుల్లో 33.80 సగటుతో 338 పరుగులు సాధించాడు. ఇక ఈ ఏడాది 7 మ్యాచుల్లోనే 244 పరుగులు చేశాడు. భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు.

ఎట్టకేలకు రెండో విజయాన్ని:
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని ముంబై 2 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో ఛేదించింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది రెండో విజయం కావడం విశేషం. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.


Click it and Unblock the Notifications












