Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: ఒకే ప్రాంఛైజీ చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

IPL 2018: Record-breaking Virat Kohli Becomes Highest Run-scorer

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో సురేశ్‌ రైనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, తాజాగా అతడి రికార్డుని కోహ్లీ బద్దలు కొట్టాడు.

రైనాను అధిగమించిన విరాట్ కోహ్లీ

రైనాను అధిగమించిన విరాట్ కోహ్లీ

టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. నిజానికి ఈ మ్యాచ్‌కి ముందు బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ... రైనా కంటే 31 పరుగుల వెనుకంజలో ఉన్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లో కోహ్లీ 62 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 92 నాటౌట్‌గా నిలవడంతో రైనాని అధిగమించాడు.

5,043 పరుగులు చేసిన కోహ్లీ

5,043 పరుగులు చేసిన కోహ్లీ

అంతేకాదు ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున కోహ్లీ ఇప్పటి వరకు 5,043 పరుగులు నమోదు చేశాడు. ఐపీఎల్‌, ఛాంపియన్‌ లీగ్‌ టీ20 కలిపి 5వేలకు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభం నుంచీ కోహ్లీ బెంగళూరు జట్టుకే ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.

ఒకే ప్రాంఛైజీ తరుపున అత్యధిక పరుగులు

తద్వారా ఒకే ప్రాంఛైజీ తరుపున అత్యధిక పరుగుల సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. కోహ్లీ తర్వాత ఈ జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా 4,558 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గాయం కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైనా ఆడలేదు.

తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరిన రైనా

తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరిన రైనా

ఈ సీజన్‌లో అంతకుముందు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రైనా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు. దీంతో రైనాను కోహ్లీ అలవోకగా అధిగమించాడు. ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్‌ శర్మ (4,345), గౌతమ్‌ గంభీర్‌ (4,210) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టీ20 క్రికెట్‌లో కోహ్లీకిది 54వ హాఫ్ సెంచరీ. గౌతమ్‌ గంభీర్‌(53), రోహిత్‌శర్మ(50) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Story first published: Wednesday, April 18, 2018, 12:22 [IST]
Other articles published on Apr 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+