
ఐపీఎల్‌లో కోహ్లీ వేగవంతమైన హాఫ్ సెంచరీ
ఐపీఎల్‌లో 4500కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సురేశ్ రైనాతో జత కలిశాడు. అంతేకాదు ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్‌లో విరాట్ కోహ్లీ 26,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. బెంగళూరు ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో శ్రేయాస్ గోపాల్ వేసిన రెండో బంతిని డీప్ వికెట్ దిశగా బాదాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న షార్ట్ అద్భుతమైన క్యాచ్‌కు విరాట్ (57:30 బంతుల్లో 7ఫోర్లు 2సిక్స్‌లు) పెవిలియన్‌కు చేరాడు.

సొంతగడ్డపై బెంగళూరుకి షాకిచ్చిన రాజస్థాన్
ఇదిలా ఉంటే సొంతగడ్డపై చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుకు రాజస్థాన్ షాకిచ్చింది. 218 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 198 పరుగులు చేసింది. దీంతో బెంగళూరుపై రాజస్థాన్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు సంజు శాంసన్(92 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో రాజస్థాన్ 4 వికెట్లకు 217 పరుగులు చేసింది.

రాజస్థాన్‌కు చక్కటి శుభారంభాన్నిచ్చిన రహానే
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్ రహానే మంచి శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ షార్ట్(11) పరుగులు సాధించడంలో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. మరోసారి చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయక నిరాశ పరిచాడు. ఆరంభంలో ఎక్కువ బంతులాడిన రహానె వేగంగా పరుగులు సాధించాడు. జట్టు స్కోరు 49 వద్ద రహానె వెనుదిరిగగా.. 59 వద్ద షార్ట్ ఔటయ్యాడు.

రాజస్థాన్ విజయంలో సంజు శాంసన్ కీలకపాత్ర
ఈ దశలో క్రీజులో ఉన్న యువ క్రికెటర్ సంజు శాంసన్(92నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడాడు. తన మార్క్‌షాట్లతో సునాయాసంగా బౌండరీలు బాదేశాడు. ఈ క్రమంలోనే స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్(27) నిదానంగా ఆడుతూ శాంసన్‌కు సహకారం అందించాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో సంజు సిక్సర్లే బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 10 సిక్సర్లు బాదిన శాంసన్ జట్టు స్కోరును 200 దాటించాడు. ఇంకో రెండు మూడు బంతులుంటే సెంచరీ కూడా పూర్తయ్యేది.

విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ
బట్లర్ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన త్రిపాఠి కూడా 5 బంతుల్లో 14 పరుగులు సాధించి ఆకట్టుకున్నాడు. అనంతరం 218 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ(57), మన్‌దీప్‌సింగ్(47 నాటౌట్) మాత్రమే ధాటిగా ఆడారు. క్రీజులోకి వచ్చీ రావడంతోనే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడిన కోహ్లీ బౌండరీల వర్షం కురిపించాడు.

స్వల్ప తేడాతో బెంగళూరు పరాజయం
అత్యంత వేగంగా ఆడిన విరాట్ 26 బంతుల్లోనే హాఫ్ మార్క్‌ను చేరుకున్నాడు. ఆ తరువాత ప్రమాదకర డివిలియర్స్(20) కూడా అనుకున్నంతా స్థాయిలో చెలరేగలేదు. కోహ్లీ ఔటవడంతోనే ఆర్‌సీబీపై రాజస్థాన్ బౌలర్లు మరింత ఒత్తిడి పెంచుతూ వచ్చారు. సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువ ఉండటంతో చివర్లో పరుగులొచ్చినా టార్గెట్‌కు దగ్గర వరకు వచ్చి స్వల్ప తేడాతో బెంగళూరు పరాజయం పాలైంది.


Click it and Unblock the Notifications












