ముంబై ఓటమికి ప్రధాన కారణం: 2 బంతుల్లో 26 పరుగులు

హైదరాబాద్: చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో అంతకముందు వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయం సాధించి.. బెంగళూరులో కూడా ఫేవరేట్‌గా బరిలోకి దిగింది.
అయితే, 168 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసింది. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతున్న ముంబైను హార్దిక్ పాండ్యా (50), డుమిని (23) ఆదుకున్నారు.

అనవసర పరుగుకు యత్నించి డుమిని రనౌట్
అప్పటివరకు దూకుడుగా ఆడుతున్న డుమిని అనవసర పరుగుకు యత్నించి రనౌట్ అవడం, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా సోదరులు గెలుపు బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్నారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ.. చివరి వరకు ముంబైని గెలిపించేందుకు ప్రయత్నించారు.

ఆఖరి ఓవర్‌లో ముంబై విజయానికి 25 పరుగులు
అయితే, 19వ ఓవర్లో కృనాల్ (23) పెవిలియన్‌కు చేరడం.... ఆఖరి ఓవర్‌లో ముంబై విజయానికి 25 పరుగులు కావాల్సిన స్థితిలో తొలి బంతికే హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేరడంతో ముంబై ఓటమి పాలైంది. అయితే ముంబై ఓటమికి రెండు బంతుల్లో 26 పరుగులు సమర్పించుకోవడమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

19 ఓవర్లు ముగిసే సమయానికి ఇరు జట్లు సమానం
ఇరు జట్ల స్కోర్లను ఒక్కసారి పరిశీలిస్తే... 19 ఓవర్లు ముగిసే సమయానికి రెండు జట్లూ 143 పరుగుల చొప్పున చేశాయి. అయితే, రాయల్ ఛాలెంజర్స్ ఆఖరి ఓవర్లో 24 పరుగులు రాబట్టింది. చివరి బంతిని సిక్స్ ఇచ్చిన మిచెల్ మెక్లన్‌గన్ నోబాల్ వేయడంతో బెంగళూరుకు అదనంగా పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో గ్రాండ్‌హోమ్ రెండు సిక్స్‌లు బాదాడు.
Ov 19.6 - Mitchell McClenaghan to Colin de Grandhomme, no-ball over waist height slapped for six!
Ov 19.6 - Mitchell McClenaghan to Colin de Grandhomme, free hit smashed over long off for six!

పాండ్యా వేసిన నోబాల్‌ను సిక్స్ బాదిన మెక్‌కల్లమ్
అంతకు ముందు 9.2వ ఓవర్ బంతికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. పాండ్యా వేసిన నోబాల్‌ను సిక్స్ బాదిన మెక్‌కల్లమ్.. ఆ తర్వాతి ఫ్రి హిట్‌ను కూడా సిక్స్‌గా మలిచాడు. దీంతో ఒక్క బంతికి 13 పరుగుల చొప్పున రెండు సందర్భాల్లో కలిపి రెండు బంతుల్లో 26 పరుగులను బెంగళూరు అదనంగా రాబట్టింది.
Ov 9.2 - Hardik Pandya to Brendon McCullum, six off a no-ball!
Ov 9.2 - Hardik Pandya to Brendon McCullum, six again on the free hit, over the keeper's head!

జట్టు కూర్పు కూడా సరిగా లేదు
ఇదే ముంబై ఇండియన్స్ ఓటమికి కారణమైంది. అంతేకాదు జట్టు కూర్పు విషయంలోనూ రోహిత్ తికమక పడ్డాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో మెక్లన్‌గన్‌కు బదులు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఆడించి ఉంటే బాగుండేది. ఎందుకంటే డెత్ ఓవర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో దిట్ట.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications