Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆరో మ్యాచ్ ఆడనున్న బెంగళూరు × వరుస విజయాలతో చెన్నై జోరు

IPL 2018: RCB vs CSK Preview: Playing 11s, Timings, Live Streaming & More

హైదరాబాద్: వరుస విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై జట్టుకు బెంగళూరు బ్రేకులు వేయనుందా..? చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఓటమినే బెంగళూరు జట్టుకు ప్రసాదించనుందా..? మరి కొద్ది గంటలలో వీరి ప్రతాపం తేలేందుకు బెంగుళు చిన్నస్వామి స్టేడియం రంగం సిద్ధం చేసింది. ధోనీ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లీ నాయకత్వంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఈ సీజనులో తొలిసారిగా తలపడనున్నాయి.

ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయినట్లు స్టేడియం నిర్వాహకులు తెలిపారంటే.. ఈ మ్యాచ్‌పై ఎలాంటి అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడి సత్తా

ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడి సత్తా

రెండేళ్ల నిషేధం తర్వాత పునరాగమనం చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. మొదటి మ్యాచ్‌ నుంచీ జోరు కొనసాగిస్తూనే వస్తోంది. జట్టులో దాదాపు 30ఏళ్లకు పైబడిన ఆటగాళ్లే ఉన్నా..ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు సత్తా చాటుతూ జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. తొలి మ్యాచ్‌లో బ్రావో, రెండో మ్యాచ్‌లో బిల్లింగ్స్‌, మూడో మ్యాచ్‌లో ధోనీ, నాలుగో మ్యాచ్‌లో వాట్సన్‌..ఇక సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు అంబటి రాయుడు..ఇలా ఒక్కొక్కరు ఒక్కో మ్యాచ్‌లో చెలరేగి జట్టును విజయతీరాలకు చేరుస్తున్నారు.

 దీపక్‌ చాహార్‌ రూపంలో నమ్మకమైన బౌలర్‌

దీపక్‌ చాహార్‌ రూపంలో నమ్మకమైన బౌలర్‌

దీంతో చెన్నై ఆడిన 5 మ్యాచ్‌లలో 4 గెలిచి పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. కానీ, ఐపీఎల్‌‌లో మెరుగైన రికార్డు ఉన్న సురేశ్‌ రైనా నుంచి ఈ సీజనులో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ రాలేదు. ఈ క్రమంలో బెంగళూరుతో మ్యాచ్‌లో రైనా బ్యాట్‌కు పనిచెప్తే చెన్నైకు తిరుగుండదు. మరోవైపు బౌలింగ్‌లైనప్‌ కాస్త బలహీనంగా కనిపిస్తున్న చెన్నైకి దీపక్‌ చాహార్‌ రూపంలో నమ్మకమైన బౌలర్‌ దొరికాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో చాహార్‌ అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

డివిలియర్స్‌, కోహ్లీను తక్కువ పరుగులకే

డివిలియర్స్‌, కోహ్లీను తక్కువ పరుగులకే

కరణ్‌ శర్మ, షేన్‌ వాట్సన్‌, డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌ డ్వేన్‌ బ్రావో కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తుండటం చెన్నైకు కలిసొచ్చే అంశం. స్పిన్‌ బౌలర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలో బెంగళూరుతో మ్యాచ్‌లో బౌలర్లంతా సమష్టిగా రాణించి కీలక ఆటగాళ్లు డివిలియర్స్‌, కోహ్లీను తక్కువ పరుగులకే కట్టడి చేస్తే చెన్నైను మరోసారి విజయం వరిస్తుంది.

బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్నా తడబడుతూనే

బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్నా తడబడుతూనే

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగి ఉన్నా ఈ సీజన్‌ ఆరంభం నుంచి తడబడుతూనే ఉంది. ప్రపంచంలోనే ఎలాంటి బౌలర్‌నైనా సులువుగా ఎదుర్కొనే సత్తా ఉన్న డివిలియర్స్‌, విరాట్ కోహ్లీ లాంటి కీలక ఆటగాళ్ల మీదే జట్టు దాదాపుగా ఆధారపడుతోంది. డివిలియర్స్‌ ఫామ్‌లో ఉన్నా కోహ్లీ తడబాటు బెంగళూరు అభిమానుల్ని కాస్త కలవరపెడుతోంది. మరోవైపు ఓపెనర్‌ డికాక్‌, కోరే అండర్సన్‌ బ్యాట్‌ ఝళిపిస్తే బెంగళూరు స్కోరుబోర్డు పరుగులు పెట్టే అవకాశం ఉంది.

కీలక సమయాల్లో జట్టుకు తోడ్పాటునందిస్తున్నాడు

కీలక సమయాల్లో జట్టుకు తోడ్పాటునందిస్తున్నాడు

మిడిల్‌ ఆర్డర్‌లో మన్‌దీప్‌ సింగ్‌ కీలక సమయాల్లో రాణిస్తూ జట్టుకు తోడ్పాటునందిస్తున్నాడు. ఇక బౌలింగ్‌లో ఉమేశ్‌ యాదవ్‌ అద్భుతంగా రాణిస్తుండటం బెంగళూరుకు అదనపు బలం. అతనికి తోడు వాషింగ్టన్‌ సుందర్‌, క్రిస్‌ వోక్స్‌, చాహల్‌ కూడా రాణిస్తే చెన్నైను తక్కువ పరుగులకే కట్టడి చేయవచ్చు.

 ఐపీఎల్‌లో బెంగళూరుపై చెన్నైదే పైచేయి:

ఐపీఎల్‌లో బెంగళూరుపై చెన్నైదే పైచేయి:

ఇప్పటి వరకూ ఇరు జట్లు ఐపీఎల్‌లో 21సార్లు తలపడగా, అందులో చెన్నై 13సార్లు గెలవగా, ఆర్‌సీబీ 7సార్లు విజయం సాధించింది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. బెంగళూరు వేదికగా జరిగిన ఏడు మ్యాచ్‌లలో చెన్నై మూడింట గెలవగా, ఆర్‌సీబీ మూడు సార్లు నెగ్గంది. మిగతా మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. మరో వికెట్‌ తీస్తే ఉమేశ్‌ యాదవ్‌ ఐపీఎల్‌లో 100వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరతాడు.

Story first published: Wednesday, April 25, 2018, 17:18 [IST]
Other articles published on Apr 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+