Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ సూపర్‌మ్యాన్ క్యాచ్.. నోరెళ్ల బెట్టిన అనుష్క (వీడియో వైరల్)

IPL 2018: RCB Captain Virat Kohli Takes Spectacular Superman-like Catch Against KKR

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. టోర్నీలో భాగంగా ఆదివారం సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో బెంగళూరు ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడగా బెంగళూరుకు ఇది ఐదో ఓటమి.

ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో కోహ్లీ సూపర్ క్యాచ్

ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో కోహ్లీ సూపర్ క్యాచ్

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ కోహ్లీ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. కోహ్లీ పట్టిన ఈ క్యాచ్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

సూపర్ మ్యాన్‌ను తలపించిన కోహ్లీ క్యాచ్

బెంగళూరు బౌలర్ మహమ్మద్ సిరాజ్ వేసిన 19వ ఓవర్ ఐదో బంతిని దినేశ్ కార్తీక్ లాంగ్ ఆన్‌లో భారీ షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ మెరుపు వేగంతో డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. కోహ్లీ అందుకున్న ఈ క్యాచ్ సూపర్‌మ్యాన్‌ను తలపించింది. అయితే, అప్పటికే బెంగళూరు ఓటమి ఖాయమైంది.

నోరెళ్ల బెట్టిన అనుష్క శర్మ

దీంతో దినేశ్ కార్తీక్‌ను క్యాచ్ రూపంలో పెవిలియన్‌కు పంపిన కోహ్లీ మాత్రం నిరాశతోనే బంతిని బౌలర్ వైపు విసిరేశాడు. అదే సమయంలో గ్యాలరీలో ఉన్న కోహ్లీ సతీమణి అనుష్క శర్మ నోరెళ్ల బెట్టింది. అప్పటికే ఆర్‌సీబీ ఓటమి ఖరారు కావడంతో ఆమె ఎలాంటి సంబరాలు చేసుకోకుండా మౌనంగా ఉండిపోయింది.

అర్‌బీసీపై కోల్‌కతా విజయం

అర్‌బీసీపై కోల్‌కతా విజయం

మరోవైపు తనతో పాటు మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన వారు సందడి చేస్తున్న అనుష్క మాత్రం కోహ్లీ వైపు ఓ చూపు చూసింది అంతే. అయితే, కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ కేవలం 10 బంతుల్లోనే 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 23 పరుగులు సాధించి కోల్‌కతాకు విజయాన్నందించాడు.

Story first published: Monday, April 30, 2018, 15:25 [IST]
Other articles published on Apr 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+